Introduction
ఈ పేజీ నందు మనము ఇప్పుడు జగనన్న చేదోడు ( టైలర్లకు,రజకులకు,బార్బర్లకు) పథకానికి సంబంధించి ఈ 2023 సంవత్సరంలో లబ్ది పొందాలంటే ప్రభుత్వం అధికారికంగా ఒక 31 అంశాలను వివరంగా ఇవ్వడం జరిగింది, కనుక ఆ అంశాలు అన్నింటిని క్షుణ్ణంగా తెలుసుకుంటే ఇక ఏ సందేహాలు రావు.కాబట్టి ఈ పేజీలో ఇచ్చిన ప్రతి అంశం చాల ముఖ్యమైన అంశాలు అని మరీ ప్రత్యేకంగా తెలుపుచున్నాను.ఈ పథకంలో ఎవరైనా ఇబ్బందులకు గురి చేసినా లేదా ఇంకా ఏమైనా సందేహాలు వున్నచో ప్రభుత్వం అధికారికంగా ఇచ్చిన 1902 నెంబర్ కి కాల్ చేసి ప్రభుత్వానికి తెలుపునచో మీ సమస్యని పరిష్కరించేదెరు.
1) చేదోడు పథకానికి సంబంధించి క్రొత్త లబ్ది దారులతో పాటు,పాత లబ్ది దారులు కూడా Caste,income,establishment సర్టిఫికెట్స్ ఖచ్చితంగా ఉండాలా ?
జ) క్రొత్త,పాత లబ్ది దారులందరూ Ap Seva Portal లో తీసుకున్న Caste,Income,Establishment సర్టిఫికెట్స్ ఉండాలి.గతంలో Ap Seva Portal లో తీసుకుని వుంటే ఇప్పుడు క్రొత్తగా తీసుకోవాల్సిన అవసరం లేదు.
2) కొంత మంది గతంలోనే AP Seva Portal లోషాప్ కి సంబంధించి Establishment సర్టిఫికెట్ పొంది వుంటారు,అలాంటివాళ్లు మళ్ళీ తీసుకోవాలా?
మీ సర్టిఫికేట్స్ AP seva portal లో తీసుకునిందా..కాదా అనే విషయాన్ని ఈ క్రింది లింక్ ద్వారా చెక్ చేసుకోగలరు.
LINK - CLICK HERE
జ) గతంలో తీసుకొని ఉంటే ఇప్పుడు అవసరం లేదు,కానీ అందులో Validity దగ్గర ఈ క్రింది ఫోటో లో చూపించిన చోట Expiry అయిపోయి ఉంటే అలాంటి వాళ్ళు మాత్రం సచివాలయం లో రెన్యువల్ చేయించుకోవాలి.
3) గత సంవత్సరం లబ్ధిదారుల పేర్లు ఈ సారి వెరిఫికేషన్ కి రాలేదు.అలాంటి వారికీ ఏమి చేయాలి ?
జ) ఆ లబ్దిదారులు నిజంగా ఈ పథకానికి అర్హత అని నిర్దారణ అయితే అలంటి వారికీ New Application క్రింద నమోదు చేసుకోవచ్చు.
4) New Application ఎవరి లాగిన్ లో దరఖాస్తు చేసుకోవాలి?
జ) సచివాలయం లోని వెల్ఫేర్ సెక్రటరీ యొక్క లాగిన్ లో మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చును.
5) గత సంవత్సరం లబ్ది పొందిన వారు ఇప్పుడు చనిపోయి ఉండడం గానీ లేదా ఈ సంవత్సరం అనర్హులు అని తేలినా,అదే కుటుంబానికి చెందిన వారిలో ఇంకేవరికైనా పెట్టవచ్ఛా?
జ) మొదట అనర్హులు అని భావించిన లబ్ధిదారులకు Not Recommended అని వివరాలను Update చేసిన తరువాత ఆధార్ కుటుంభం నుండి అర్హత వున్నా వారికీ New Application క్రింద నమోదు చేసుకోవచ్చు.
6) కొంతమంది హౌస్ హోల్డ్ ఒక సచివాలయ పరిధిలో ఉంటూ షాప్ మాత్రం మరొక సచివాలయ పరిధిలో వున్నచో అలంటి వారికీ వెరిఫికేషన్ ఏ విధంగా చేయాలి ?
జ) సచివాలయ సెక్రటరీ కి ఇచ్చిన మొబైల్ యాప్ నందు search అనే ఆప్షన్ ద్వారా షాప్ ఏ సచివాలయ పరిధిలో ఉందొ అక్కడి సచివాలయ సిబ్బంది వెరిఫికేషన్ చేసి Geo tagging చేయడం జరుగుతుంది. ఆ తరువాత NBM పోర్టల్ లో కూడా షాప్ వున్న సచివాలయ పరిధిలోనే పేర్లు వస్తాయి.అంతేగానీ హౌసేహోల్డ్ వున్నా సచివాలయ సిబ్బంది కాదు అని వివరంగా ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలలో ఇవ్వడం జరిగింది.
7) కొంతమంది టైలర్లు,వారి యొక్క ఇంటి వద్దనే ఈ వృత్తి ని సాగిస్తూ వుంటారు,ఇటువంటి వాళ్ళు అర్హులా..కదా ?
8) కొంత మంది రజకులు ఇంటి వద్దనే వారి ఇంటి వద్దనే వృత్తి నిర్వహిస్తూ వుంటారు, అలాంటి వాళ్ళు అర్హులా..కదా..?
9) కొంతమంది బార్బర్లు ఇంటి వద్దనే వారి ఇంటి వద్దనే వృత్తి నిర్వహిస్తూ వుంటారు, అలాంటి వాళ్ళు అర్హులా..కదా..?
10) ఏయె పథకాలు పొందే వాళ్ళు ఈ పథకానికి అర్హులు కారు?
జ) వాహన మిత్ర, నేతన్న నేస్తం, మత్యకార భరోసా పథకాలు పొందేవాళ్ళలో డైరెక్ట్ లబ్ధిదారులు అయితే ఈ పథకానికి అర్హులు కారు.కానీ ఆ కుటుంభంలో ఇంకెవరైనా ఈ పథకానికి అర్హతగా ఉంటే మాత్రం ఖచితంగా అర్హులే.
11) ఏయే పథకాలు పొందేవాళ్ళు ఈ చేదోడు కి అర్హులు?
జ) డైరెక్ట్ లబ్ది దారులు వైస్సార్ రైతు భరోసా,వైస్సార్ చేయూత,కాపు నేస్తం,EBC నేస్తం, అమ్మఒడి, పథకాలలో ఇది వరకే లబ్ది పొందుతూ వున్న వాళ్ళు అయినా ఈ జగనన్న చేదోడు పథకానికి అర్హులే.
12) వైస్సార్ పెన్షన్ పొందేవాళ్ళు ఈ పథకానికి అర్హులా..కాదా?
జ) వయస్సు 60 సంవత్సరాల పైన వయస్సు వుండి మరియు వృత్తి పరమైన పెన్షన్స్ ఏమైనా పొందుతూ ఉంటే అట్టి వాళ్ళు మాత్రం అనర్హులు.మిగిలిన పెన్షన్స్ పొందేవాళ్ళు 60 సంవత్సరాల వయస్సు లోపల ఉంటే అర్హులు.
0 Comments