జగనన్న విద్యా దీవేన లో బ్యాంక్ అకౌంట్ కి ఓపెనింగ్ లో కలిగే సందేహాలు-సమాధానాలు
ఈ పేజీ లోని ముఖ్యాంశాలు
1) Introduction
2) JVD కి జాయింట్ బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్ చేసేటప్పుడు కలిగే సందేహాలు
1) Introduction
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విధ్యార్ధులకు సంబంధించి జగనన్న విద్యా దీవెన మరియు జగనన్న వసతి దీవెన అమౌంట్ అనేది ఇప్పటి వరకు స్టూడెంట్ యొక్క తల్లి ఖాతాలో వేసేవారు,కానీ ఇప్పుడు వచ్చిన క్రొత్త అప్డేట్ ప్రకారం ఇకమీదట తల్లి మరియు విద్యార్థి ఇద్దరూ వున్న జాయింట్ అకౌంట్ లలో డబ్బులు వేస్తామని తెలుపడంతో తల్లి తండ్రులు,విద్యార్థులు అకౌంట్స్ ఓపెన్ చేసుకోవడానికి బ్యాంకులకు పరుగులు తీసుస్తున్నారు.కనుక ఈ జాయింట్ అకౌంట్స్ ఓపెన్ చేసుకునేటప్పుడు చాలా సందేహాలను కూడా వ్యక్తపరుస్తున్నారు. కావున ఈ పేజీ లో చాలా సందేహాలకు సమాధానాలు అధికారిక సమాచారంతో ఇవ్వడం జరిగింది కనుక ఈ సమాచారాన్ని మీ తోటి స్నేహితులకు కూడా తెలియపరచుకుని అందరూ లబ్ది పొందగలరు.
2) JVD కి జాయింట్ బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్ చేసేటప్పుడు కలిగే సందేహాలు
1) Joint accounts ఎవరెవరు చేయించుకోవాలి ?
జ) ఏ ఇయర్ చదువుతున్న SC కులానికి చెందిన విద్యార్థులు అయినా మరియు 2022-23 సంవత్సరంలో final year పూర్తి అయిన వాళ్ళు మరియు ఏ కులం విద్యార్థులు అయినా జాయింట్ అకౌంట్ చేసుకోవాల్సిన అవసరం లేదు,మరియు ఇప్పుడు ఫైనల్ ఇయర్ చదువుతున్న ఏ కులం విద్యార్థి అయినా కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు. మిగిలిన వారు మాత్రం తప్పకుండా జాయింట్ అకౌంట్ చేయించుకోవాలి.
2) Joint account లో ఎవరెవరు ఉండాలి ?
జ) విద్యార్థి primary account holder గా ఉండాలి మరియు తల్లి secondary account holder గా ఉండాలి.
Note: ఒకవేళ తల్లి మరణించి ఉంటే తండ్రి / సంరక్షకుడు గానీ ఉండవచ్చు.
3) ఒక తల్లికి ఇద్దరు లేదా ముగ్గురు చదివే పిల్లలు ఉన్నపుడు ఒక్కొకరికి ఒక్కొక account ఓపెన్ చేయలా లేక ఓకే account అందరికి ఓపెన్ చేయవచ్చా?
జ) ఒక్కొకరు ఒక్కొకటిగా అయినా చేసుకోవచ్చు లేదా అందరూ కలిసి ఒక్కటే అకౌంట్ కూడా చేసుకోవచ్చు.కానీ అందరూ ఒకటే అకౌంట్ చేసుకునే సమయంలో primary account holder గా student's లో ఎవరి course అయితే ఇంకా ఎక్కువ సంవత్సరాలు చదవవలసి ఉన్నదో (అందరికంటే చిన్న వాడు అయితే ఇంకా చాల సంవత్సరాలు కోర్స్ ఉంటుంది) ఆ student ని primary holder గా పెట్టి మిగిలిన students ని మరియు తల్లిని Secondary holder గా పెట్టాలి.
4) Account ఏ bank లో చేయించాలి?
జ) ఆంధ్రప్రదేశ్ లో Joint account చేసే ఏ bank లో నైనా చేసుకోవచ్చు.
5) Post office లో joint account చేసుకోవచ్చా ?
జ) Post office లలో joint account చేసే వెసులుబాటు లేదు.
6) చిన్నప్పుడు RDT లో చేసిన joint account సరిపోతుందా?
జ) చిన్నప్పుడు student మైనర్ కాబట్టి primary account holder గా mother ఉండి ఉంటారు, అలాకాకుండా student ఏ primary account holder గా ఉంటే సరిపోతుంది. ఒకసారి bank లో primary ఎవరు ఉన్నారో కనుకోవాలి.
7) Joint account కి ATM card ఉండవచ్చా?
జ) అకౌంట్స్ కి ATM గానీ net banking లాంటివి కానీ ఉండకూడదు. ఒకవేళ ఉంటే ఆ services deactivate చేయించుకోవాలి.Check book అయితే ఉండవచ్చును.
8) Joint account zero account ఉండవచ్చా?
జ) జీరో అకౌంట్ఉండవచ్చు లేదా సాధారణ సేవింగ్ అకౌంట్ అయినా కూడా ఉండవచ్చును.
9) Account జెరాక్స్ సచివాలయంలో ఎప్పటిలోగా ఇవ్వాలి?
జ) 24th November.
10) Student కి ఇప్పటికే ఉన్న Bank account లోకి తల్లిని Add చేసి joint account గా మార్చుకోవచ్చా ?
జ) మార్చుకోవచ్చు.కానీ ఈ అకౌంట్ కి ATM ఉండకూడదు,ఆలా ఉంటే మాత్రం చెల్లదు అంటున్నారు వీలైనంతవరకు నూతన అకౌంట్ ని ఓపెన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి.
11) తల్లి కి ఇప్పటికే బ్యాంకు అకౌంట్ కలదు,అందులో స్టూడెంట్ ని add చేసుకోవచ్చా ?
జ) కుదరదు,ఎందుకంటే ఇప్పటికే అకౌంట్ వున్న తల్లి Primary Account Holder గా ఉంటుంది కనుక అది చెల్లదు.ఒకవేళ అదే అకౌంట్ కి స్టూడెంట్ ని add చేసిన తరువాత స్టూడెంట్ ని Primary Holder గా మార్చి తల్లిని Secondary Holder గా మార్చుకుని కూడా చేసుకోవచ్చు.
గమనిక - ఆ కౌంట్ కి ATM గానీ మరియు Internet Banking సర్వీసులు గానీ ఉండకూడదు.
12) తల్లి మరణించి ఉంటే ఏమి చేయాలి?
జ) తండ్రి ని కానీ లేదా సంరక్షుడు ని గానీ పెట్టి జాయింట్ అకౌంట్ చేసుకోవచ్చు.
13) ఈ అకౌంట్ లో మినిమమ్ బాలన్స్ పెట్టుకోవాలా ?
జ) అవసరం లేదు
14) బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేయడానికి ఎయె డాకుమెంట్స్ తీసుకెళ్లాలి ?
A . తల్లి మరియు విద్యార్థి యొక్క పాస్పోర్ట్ సైజు ఫోటోలు విడివిడిగా 3 తీసుకెళ్లాలి.
B. విద్యార్థి మరియు తల్లి యొక్క ఆధార్ జెరాక్సులు
C. విద్యార్థి యొక్క ID కార్డు జెరాక్స్
D. విద్యార్థికి ఆధార్ కార్డు లో పుట్టిన తేదీ లేకపోతే 10 వతరగతి మార్కుల మెమో ని ఇవ్వాలి.
15) ఈ జాయింట్ అకౌంట్స్ కి NPCI లింక్ చేయించుకోవాలా?
జ) ఈ జాయింట్ అకౌంట్లకు అవసరం లేదు.
16) జాయింట్ అకౌంట్ కి ATM / NET BANKING ఉండచ్చా?
జ) ఉండకూడదు.
17) ఈ విడత డబ్బులు ఎప్పుడు జమ కానున్నాయి?
జ) ఈ నాల్గవ విడత డబ్బులు స్టూడెంట్ మరియు తల్లి యొక్క జాయింట్ అకౌంట్ నందు ఈ నవంబర్ 28 వ తారీఖున జమ కానున్నాయి.
0 Comments