ఆంధ్రప్రదేశ్ లో క్రొత్తగా ఏర్పాటైన ఉమ్మడి ప్రభుత్వం, గతంలో ఇచ్చిన ఎన్నికల హామీల మేరకు పెన్షన్లు పెంపు చేయడం అయితే జరిగింది.కానీ చాలా మంది ఎక్కువ వాడుకలో వున్న ఒక 4 లేదా 5 పెన్షన్లు మాత్రమే పెరిగాయి అని అనుకున్నారు, కానీ 20 పెన్షన్లు వరకు కూడా అమౌంట్ పెంచడం జరిగింది.కనుక అవేమిటో ఇప్పుడు ఒకసారి చూద్దాం.
NTR భరోసా పెన్షన్ పథకం లో రూ.4000/- పెన్షన్ ఎవరికి అందనుంది తెలుసా!
ఈ క్రింది 11 రకాలైన పెన్షన్ దారులకు పెంచిన పెన్షన్ 3000 నుండి 4000 వరకు అందుకోవడం జరుగుతుంది.
1. వృద్ధాప్య పింఛను దారులకు,
2. వితంతువులకు,
3. చేనేత కార్మికులు,
4. చర్మ కళాకారులు,
5. మత్స్యకారులు,
6. ఒంటరి మహిళలు,
7. సాంప్రదాయ,
8. ట్రాన్స్ జెండర్లు,
9. ART (PLHIV)
10. డప్పు కళాకారులు మరియు
11. కళాకారులకు పెన్షన్లు (Artist)
విభిన్న ప్రతిభావంతులుకు (వికలాంగులకు) పెన్షన్ పెంపు - 4000
- వికలాంగుల పెన్షన్ 3000 రూపాయల నుండి 6000 రూపాయలకు పెంచడం జరిగినది.
- కుష్ఠు వ్యాధిగ్రస్తులకు కూడా3000ల నుండి 6000 రూపాయలకు పెంచడం జరిగినది.
- పూర్తిగా వికలాంగులైనటువంటి 5000 పెన్షన్ అందుకున్న వారికి15 వేలకు పెంచడం జరిగినది.
- పెరాలాసిస్ (వీల్ చైర్, బెడ్ కి పరిమితం అయినా వారికీ )
- పూర్తిగా ప్రమాదవశాత్తు ఎముకలు విరిగి పోయిన వారికీ (రెండు కాళ్ళు,చేతులు....!)
ఎవరికి 5000 పెన్షన్ నుండి 10,000 పెంచింది ఎవరికి?
ద్వైపాక్షిక ఎలిఫెంటియాసిస్-గ్రేడ్ 4,
కిడ్నీ, కాలేయం మరియు గుండె మార్పిడి,
CKDU డయాలసిస్ పై CKD సీరం క్రియేటినిన్> 5 mg,
CKDU డయాలసిస్పై CKD అంచనా వేసిన GFR <15 ml,
CKDU ఆన్ లో డయాలసిస్ CKD చిన్న కాంట్రాక్ట్ కిడ్నీ.
Official PDF కొరకు - DOWNLOAD
0 Comments