pm kisan status check 2024
PM kisan - ఈ 2024 ఎన్నికలలో విజయం సాధించడంతో మోదీ గారు వరుసగా 3 వ సారి ప్రధానిగా జూన్ 8 వ తేదీన ప్రమాణస్వీకారం చేసారు.కనుక ఆ రోజున రైతులకు సంబంధించిన 17 వ విడత PM Kisan డబ్బులను 9,3 కోట్ల రైతులకు ప్రయోజనం చేకూరేలా 20,000 వేల కోట్ల రూపాయలు పంపిణీ చేయడానికి దానికి సంబంధించిన ఫైల్ మీద మొదటి సంతకం చేసారు.
pm kisan 17th installment date 2024
పీఎం కిసాన్ 17 వ విడత కి సంబంధించిన డబ్బులను దేశవ్యాప్తంగా జూన్ 18,2024 వ తేదీన రైతుల ఖాతాలలో మొదటి విడత క్రింద 2000 చొప్పున వేయనున్నారు.
గమనిక - ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి కూటమి పార్టీ గతంలో అధికారం లోకి రాకమునుపు ప్రతి రైతుల ఖాతాలో 20,000 జమ చేస్తామని తెలియజేసారు.అందులో ఈ పీఎం కిసాన్ అమౌంట్ 6000 కలిపి ఉంటుందా లేదా దానికి ప్రత్యేకంగా ఇస్తారా అనేది ప్రభుత్వం నుండి వచ్చే నిర్ణయం మేరకే ఉంటుంది. కనుక ఈ పోస్ట్ వ్రాసేనాటికి అయితే AP ప్రభుత్వం నుండి ఎలాంటి అప్డేట్ లేదు.
pm kisan ekyc
పీఎం కిసాన్ డబ్బులు పడాలంటే ప్రతి రైతు కూడా ఖచ్చితంగా ekyc పూర్తి చేసుకుని ఉండాలి.అలాంటి వారికీ మాత్రమే డబ్బులు పడనున్నాయి.ఈ ekyc మీరే మొబైల్ లో ఆధార్ నెంబర్ తో మరియు OTP సహాయం తో చేసుకోవచ్చు. లేదా దగ్గరలోని మీసేవ, CSC సెంటర్ లలో కూడా చేయించుకోవచ్చు.
ekyc Link - Click Here
pm kisan beneficiary list 2024
ఈ 17 వ విడతకు సంబంధించిన అర్హులైన రైతుల వివరాలు మనమే చెక్ చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది.కనుక ఈ క్రింది ఇచ్చిన ఆ లింక్ మీద Click చేసుకుని,అక్కడ మీ వివరాలు ఇచ్చి సులభంగా చెక్ చేసుకోవచ్చును.
LINK - https://pmkisan.gov.in/Rpt_BeneficiaryStatus_pub.aspx
pm kisan payment status
మీ అకౌంట్ లో డబ్బులు పడ్డాయా లేదా మరియు ఇంకేమైనా ఇబ్బందుల వల్ల డబ్బులు జమ కాలేదా అనే విషయాలను మనమే తెలుసుకోవచ్చు.కనుక ఈ క్రింది ఇచ్చిన లింక్ ని ఓపెన్ చేసుకోగలరు.
Payment Status Check - https://pmkisan.gov.in/BeneficiaryStatus_New.aspx
- పై లింక్ ఓపెన్ చేసుకున్నాక అక్కడ Registration నెంబర్ ఎంటర్ చేసి అక్కడ నుండి మిగిలిన వివరాలు ఎంటర్ చేసి మన స్టేటస్ చెక్ చేసుకోవచ్చును.
- ఒకవేళ రిజిస్ట్రేషన్ నెంబర్ తెలియకపోతే ఈ క్రింది లింక్ నందు మొబైల్ నెంబర్ కానీ లేదా ఆధార్ కార్డు నెంబర్ ని ఇచ్చి రిజిస్ట్రేషన్ నెంబర్ తెలుసుకోవచ్చు.
0 Comments