pmsby status check online-2023
What is the details of PMSBY
ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన పథకం యొక్క వివరాలు
ఈ పథకం అనేది జీవిత బీమాకి సంబంధించిన పథకం.ఈ పథకం యొక ముఖ్య ఉద్దేశ్యం 18 సంవత్సరాల వయస్సు నుండి 70 సంవత్సరాల వయస్సు మధ్య ఉన్న వారందరూ కూడా నమోదు చెడుకోవచ్చును.వీళ్ళు ఒక సంవత్సర కాలానికి ₹20 లు ప్రీమియం చెల్లించడం ద్వారా ప్రమాదవశాత్తు మరణించిన లేదా తద్వారా పూర్తిగా/ పాక్షిక అంగవైకల్యం ఏర్పడిన వారికి ఆర్ధికంగా సహాయం చేయడం జరుగుతుంది.
ఈ పథకం యొక్క కాల పరిమితి ఎంత ?
ఈ ప్రధానమంత్రి సురక్షా భీమా యోజన (PMSBY) మరియు ప్రధానమంత్రి జీవన్ జ్యోతి భీమా యోజన (PMJJBY) పథకాలు రెండూ కుడా ప్రతి సంవత్సరం జూన్ 1 నుండి మొదలై మే 31 వరకు వర్తిస్తుంది.కావున ఈ మధ్యకాలంలో రిస్క్ జరిగిన వారికీ మాత్రమే ఈ లబ్ది చేకూరుతుంతి.కనుక రెన్యువల్ చేసుకోదలచిన మే 31 లోపల చేసుకోవాల్సివుంటుంది.
How much amount is Covered Under PMSBY
ఈ పథకం ద్వారా ఎంత అమౌంట్ క్లెయిమ్ అవుతుంది.
ఈ ప్రధానమంత్రి (PMSBY) సురక్ష భీమా యోజన పథకం లొ ప్రమాధవశాత్తు మరణించిన లేదా శాశ్వతంగా అంగవైకల్యం ఏర్పడిన వారు 30 రోజుల లోపు సంబంధిత డాక్యుమెంట్లతో మీకు అకౌంట్ కలిగిన చోట వెళ్లి దరఖాస్తు చేసుకుంటే ప్రమాద తీవ్రత బట్టి 2 లక్షల రూపాయలను అందజేయడం జరుగుతుంది.అదే విధంగా పాక్షిక అంగవైకల్యం ఏర్పడిన వారికి 1లక్ష రూపాయల ను అందజేయడం జరుగుతుంది.
How do you check whether PMSBY is active or Not
ఈ ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన పథకంలో నమోదు అయ్యమా లేదా ఎలా తెలుసుకోవాలి.
ఈ స్టేటుస్ ని 3 రకాలుగా తెలుసుకునే అవకాశం కలదు.
- 1) Online ద్వారా
- 2) Net Banking ఆప్షన్ ద్వారా
- 3) బ్యాంక్ ద్వారా
PMSBY Certificate Download
1) Online ద్వారా: ఈ Online ద్వారా చాలా సులభంగా ఈ క్రింది వివరాలు నమోదు చేసి తెలుసుకోవచ్చు.
కావాల్సిన వివరాలు
1.ఆధార్ కార్డ్ నెంబర్ ద్వారా
2.బ్యాంక్ అకౌంట్ ద్వారా
3.పాన్ కార్డ్ నెంబర్
4.సర్టిఫికెట్ నెంబర్
5.మొబైల్ నెంబర్ ద్వారా
Download Demo Video
STEP 1: పైన ఇచ్చిన లింక్ ఓపెన్ చేసుకుంటే ఈ క్రింది విధమైన పేజీ ఓపెన్ అవుతుంది.
STEP 2: Select Policy Year దగ్గర ఆర్ధిక సంవత్సరం ని ఎంచుకోవాలి.
STEP 3: ఇక్కడ మీకు సంబంధించిన బ్యాంక్ ని (బ్యాంకులు విలీనం అయిన తర్వాత ఉన్న పేరు ద్వారా) ఎంచుకోవాలి.
STEP 4: ఇక్కడ పైన తెలిపిన ఏవేని 5 డాక్యుమెంట్లలో ఒకదానిని ఎంచుకుని అక్కడే సంబందిత నెంబర్ ఎంటర్ చేసి Search చేయాలి.
అక్కడ మీరు ఈ ఆర్ధిక సంవత్సరం కి ఈ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి భీమా యోజన లో రిజిస్టర్ అయుంటే సర్టిఫికేట్ ఒకటి Download అయిపోతుంది. లేదంటే No Data Found అని వస్తుంది.
Sample Certificate Photo
2) Net Banking ఆప్షన్ ద్వారా: మీరు వ్యక్తిగతంగా Internet Banking Service ని కలిగివున్నట్లయితే
Step 1 - మీ బ్యాంక్ సైట్ లో లాగిన్ అవ్వాలి.
Step 2- అక్కడ PMSBY ఆప్షన్ లోకి వెళ్ళండి.
Step 3- అక్కడ మీ అకౌంట్ నెంబర్ లేదా అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసి తెలుసుకోవచ్చు.
.
3) బ్యాంక్ ద్వారా: మీరు మీ బ్యాంక్ వద్దకు వెళ్లి పాస్ బుక్ లో లావాదేవీలను ప్రింట్ చేయించుకుని అందులో PMSBY పేరుతో ₹ 20 కట్ అయిందా లేదా అని చెక్ చెసుకోవచ్చును.లేదా అక్కడే Statement అడిగి తీసుకుని తద్వారా కూడా చెక్ చేసుకోవచ్చును.
CLAIM FORM PDF
PMSBY Apply Online
ఈ పథకానికి దరఖాస్తు చేయు విధానము
1) Self గా Internet Banking ఆప్షన్ ద్వారా Online లోనే దరఖాస్తు చేసుకోవచ్చు.
2) మీ అకౌంట్ కలిగిన బ్యాంక్ నందు వెళ్లి సులభంగా చేసుకోవచ్చు
3) పోస్టు ఆఫీస్ లో అకౌంట్ కలిగిన కూడా అక్కడ కూడా చేసుకోవచ్చును.
NEW APPLY FORM
SELF ONLINE APPLY PROCESS DEMO VIDEO
How do i cancel my PMSBY Scheme
Pmsby పథకాన్నీ ఎలా రద్దు చేసుకోవాలి.
ఈ Pmsby పథకానికి సంబంధించి మొదట మీరు ఈ ఆర్ధిక సంవత్సరం లో నమోదు అయి ఉన్నారా లేదా అని పైన తెలిపిఉన్న ఆప్షన్స్ ద్వారా గుర్తించండి.ఆ తర్వాత మీరు రద్దు చేసుకోదలిస్తే సంబంధిత బ్యాంక్ వద్దకు ఒక అర్జీ లేదా అక్కడ వారు ఏదైనా అప్లికేషన్ ఇస్తే వాటిని వ్రాసుకుని వెళ్లి రద్దు చేయమని కోరవలెను.అక్కడ మీ బ్యాంక్ అకౌంట్ కి Auto Debit ఆప్షన్ ని Stop చేయించుకోవాలి.అప్పటి నుండి ఆటోమేటిక్ గా Renewal సమయాన డబ్బులు అనేటివి కట్ కాకుండా ఉంటాయి.
PMSBY FAQ
దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అధికారికంగా చాలా సందేహాలకు సమాధానాలను ఒక PDF రూపంలో ఇవ్వడం జరిగింది.కనుక దానికి సంబంధించిన PDF ని ఏ క్రింద ఇవ్వడం జరుగుతుంది. కనుక అక్కడ క్లిక్ చేసుకుని వివరంగా తెలుసుకోగలరు.
CONCLUSION
ఈ పేజీ నందు ప్రధానమంత్రి సురక్షా భీమా యోజన (PMSBY) కి సంబంధించి మీరు రిజిస్టర్ అయి వుండారా లేదా అని ONLINE లో చెక్ చెసుకోవడం ఎలాగో వివరంగా తెలపడం జరిగింది.కావున ఇందులో ఏమైనా మీకు ఏమైనా సందేహాలు ఉంటే నాకు తెలుపగలరు.ఖచ్చితంగా మీకు తగిన రీతిలో సంబంధించిన అధికారిక సమాచారంని ఇవ్వడం జరుగును.
0 Comments