ఉచిత బస్సు - సంక్రాంతికి బయలుదేరునా ?
బస్సు ఎక్కడ? స్టేషన్లోనేనా?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనే గొప్ప పథకాన్ని సంక్రాంతి కానుకగా ప్రకటించిందనే విషయాన్నిఆంధ్రప్రదేశ్ చీఫ్ విప్ యార్లగడ్డ వెంకట్రావు గారు తన ఫేస్బుక్ పోస్టులో గర్భంగా తెలియజేశారు. “ఆటోడ్రైవర్లు ఇక నిద్ర పోవచ్చని” హామీని కూడా భరోసాగా ఇచ్చారు. కానీ, నిద్ర పోవాల్సిది ఆటోడ్రైవర్లు కాదు, ఈ వాగ్దానాలు వింటున్న ప్రజలేనని బయట వినిపిస్తున్న వార్త.
చాలా కాలంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం "అదిగో వస్తుంది, ఇదిగో వస్తుంది" అని మహిళలకు ఉచిత బస్సు పథకం గురించి ప్రచారం చేస్తూనే ఉంది. కానీ బస్సు మాత్రం ఎక్కడా కనిపించలేదు. సంక్రాంతి వచ్చేసరికి ఇది కూడా " రేషన్ కార్డు, పింఛన్లు మాదిరిగానే నవ్వుల బస్సు" అవుతుందా అనే ప్రశ్న ప్రజల మదిలో మెదులుతోంది. అధికారిక జీవో లేకుండా ఈ మంత్రులు,MLA లు, ప్రభుత్వ పెద్దలు చేసే ప్రకటనల మీద నమ్మకం చూపడమంటే ఇరవై నిమిషాలు డీజిల్ లేని బస్సు కోసం వేచి ఉండటంతో సమానమనే ప్రజలు చెవులు కొరుక్కుంటున్నారు. ప్రభుత్వం మాటల బస్సు సర్కార్ కాకుండా, నిజంగానే రోడ్లమీదకి బస్సులు నడిపిస్తేనే ప్రజలు నమ్ముతారనేది ప్రస్తుతం వున్న అట్టడుగు వాస్తవ పరిస్థితి.
"ఉచిత బస్సు పథకం – ప్రయాణం నిజమవుతుందా లేక ఊహలోనే మిగలుద్ది?"
ఆంధ్రప్రదేశ్ చీఫ్ విప్ యార్లగడ్డ వెంకట్రావు గారు ఇటీవల తన ఫేస్బుక్ పేజీలో "ఈ సంక్రాంతి నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వస్తుంది" అని గర్వంగా ప్రకటించారు. అంతేకాకుండా, ఈ పథకం ఆటో డ్రైవర్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రణాళికతో అమలు చేస్తామని హామీ ఇచ్చారు. వినడానికైతే మెల్లగా గాలి తీయాల్సిన చక్కటి వాగ్దానం! కానీ ప్రశ్న ఏమిటంటే, ఇది వాస్తవంగా రోడ్ల మీదికి వస్తుందా, లేక మరో సోషల్ మీడియా సంబరంగానే మిగలుతుందా?
ఉమ్మడి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉచిత బస్సు ప్రయాణం అనే వాగ్దానం మహిళలు ఎంతగానో ఎదురు చూస్తున్న పథకం. అయితే ఇప్పటి వరకు ప్రకటనల చక్రం మాత్రమే తిరుగుతోంది, బస్సు చక్రాలు మాత్రం కదలడం లేదు. ప్రజలు "ఆ బస్సు ఎప్పుడొస్తుంది?" అంటూ ఆగిపోయారు. జీవో రూపంలో అధికారికంగా వెలువడే వరకు ఈ మాటలపై నమ్మకం పెట్టుకోవడం కష్టమేనని ప్రజల ఆలోచన.
అదే సమయంలో, అధికారుల ఊడ్చి చెప్పు మాటలు నమ్మే పరిస్థితిలో ప్రజలు ఉండడం లేదు. మంత్రులు చెప్పేది వేరు, జరిగేది వేరు అనే అభిప్రాయం గట్టిగా పెరుగుతోంది. సంక్రాంతి ముంగిట్లో మాటల బస్సు వెనకా ముందుగా రాకుండా, నిజంగా అమలు జరగడం ద్వారా మాత్రమే ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని గెలుచుకోవాలి. "ఉచిత బస్సు పథకం అందరికీ అందుబాటులోకి వస్తే సంతోషమే కానీ, రాత్రంతా బస్ స్టాండ్ దగ్గర ఆగి ఖాళీ ప్లాట్‌ఫార్మ్ చూడకూడదు!"
"ఉచిత బస్సు పథకం – ఆటోడ్రైవర్లకు ప్రశాంత నిద్ర?"
రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన ముఖ్యంగా ప్రక్క రాష్ట్రాలలో అమలు చేసిన "మహిళకు ఉచిత బస్సు ప్రయాణ పథకం" నందు వున్న లోటుపాట్లను గమనించి,అందులో ఎక్కువగా ఆటో డ్రైవర్స్ కి బ్రతుకు జీవనం భారమైపోతుందని,కావున అలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లోని ఆటో డ్రైవర్లకు రాకూడదని, రాష్ట్ర ప్త్రభుత్వం తగిన విధి విధానాలు రూప కల్పనలో బీజీ గా ఉన్నట్టు కనిపిస్తోంది.
ముఖ్యంగా, ప్రజలు ఇప్పుడు సోషల్ మీడియా ప్రకటనలను తప్పించి జీవో రూపంలో అధికారిక ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు. వాగ్దానాలతోనే కాలం గడపడం కాకుండా, బస్సులు నిజంగానే రోడ్లపైకి రానిచ్చి, ఆటోడ్రైవర్లు తమ పనిలో ప్రశాంతంగా కొనసాగేలా చేసే చర్యలు తీసుకుంటేనే ఈ పథకం విజయం సాధించగలదు. "ప్రకటనల వీరంగం కాదు, బస్సు గమ్యం చేరి, ఆటోడ్రైవర్లు ప్రశాంతంగా నిద్ర పోగల పరిస్థితి రావాలి!"
0 Comments