మీ ఆధార్ కి ఎన్ని Sim లు లింక్ అయివున్నాయి..?
మనం మొట్టమొదటి మొబైల్ వాడకం మొదలు పెట్టినప్పటి నుండి మన ఆధార్ కార్డ్ లతో Sim లు తీసుకుని వాడుకుంటూ మరియు మన కుటుంబ సభ్యులకు కూడా తీసి ఇచ్చి ఉంటాము.దాని తర్వాత కాలక్రమేణా కొన్ని పరస్థితులలో ఆ నెంబర్ వాడకుండా వదిలేసి ఉంటాము.లేదా మనకు తెలియ కుండా మన ఆధార్ ప్రూఫ్ లతో ఎవైనా Sim లు రిజిస్టర్ అయి ఉన్నాఎమో మనం తెలుసుకుని, మనం ప్రస్తుతం వాడని నంబర్లను ఏవైనా ఉంటే వాటిని తొలగించడానికి టెలికాం మాతృ సంస్థ అయిన TRAI కి రిక్వెస్టు పెట్టుకుని తొలగించుకునే అవకాసాన్ని యిచ్చారు.
కావున మనము మన ఆధార్ కార్డ్ నెంబర్ చేసి ఎన్ని Sim లు రిజిస్టర్ అయి ఉన్నాయో అని ఈ పేజీ లో ఇచ్చిన లింక్ ద్వారా చెక్ చేసుకుని మరియు మనం ఉపయోగించని Sim లను తొలగించడానికి అక్కడ ఇచ్జిన 3 ఆప్షన్స్ లో జాగ్రత్తగా ఎంచుకుని రిక్వెస్ట్ పెట్టుకోవాలి.
ఆ తరువాత వచ్చిన నెంబర్ తో స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చును.ఆ TRAI ఇచ్చిన అఫిషియల్ వెబ్సైట్ లో వివరంగా చెక్ చేసుకోవడం ఎలాగో చూద్దాం..!!
ముఖ్య గమనిక : మన దేశం లో ఈ సౌకర్యం ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్, కేరళ, రాజస్థాన్, మరియు తెలంగాణ ప్రజలకు మాత్రమే అందుబాటులో వుంది
More Updates Join Watsapp Group
STEP 1: మొట్టమొదట ఈ క్రింది ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి,మీ ప్రూఫ్ తో తీసుకున్న మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేయండి.
STEP 2: ఈ పేజీ లో OTP వస్తుంది.దానిని ఎంటర్ చేసి Validate బటన్ పై క్లిక్ చేయాలి.
STEP 3: ఈ పేజీ నందు మన ఆధార్ కి ఇప్పటి వరకు ఎన్ని SIM లు లింక్ అయి ఉన్నాయో అవన్నీ ఇక్కడ చూపిస్తాయి.వాటిలో మీరు ఇప్పుడు ఉపయోగించనివి మరియు మీవి కానివి ఉంటే వాటి పై టిక్ ఇచ్చి,అక్కడ అక్కడ 3 రకాల ఆప్షన్స్ వస్తాయి వాటిల్లో ఒకటి జాగ్రతగా సెలెక్ట్ చేసుకొని Report పై క్లిక్ చేయాలి.
- This is not my number
- Not Required
- Required
STEP 4: ఆ ఆప్షన్ లలో ఎదైనా ఒకటి సెలెక్ట్ చేసుకొని దాని పైనే మీ ఆధార్ లో ఉన్నట్టు పేరు ని ఎంటర్ చేసి రిపోర్ట్ పై క్లిక్ చేయాలి.ఆ తరువాత మనకు ఒక ట్రాకింగ్ నెంబర్ ఒకటి వస్తుంది.దానిని భద్రంగా వ్రాసి పెట్టుకోండి. లేదంటే మనకి SMS కూడా వచ్చి ఉంటుంది.
అవి తొలగించారా లేదా అని STATUS చెక్ చేసుకోవడం ఎలా
మీరు రిపోర్ట్ పెట్టిన 24 గంటల తర్వాత ఈ క్రింది లింక్ ఓపెన్ చేసి ఇక్కడ చూపించిన విధంగా ఎంటర్ చేసి ట్రాక్ చేస్తే మీ స్టేటస్ చూపించడం జరుగుతుంది.
Website Link : Click here
Status Checking : Click here
మీ ఆధార్ కి (NPCI) ఏ బ్యాంక్ అకౌంట్ కి లింక్ అయిందో ఇలా తెలుసుకోండి.
NPCI LINK STATUS : Click Here
పై సమాచారం మాత్రం ప్రతి ఒక్కరికి ఉపయోగ పడుతుంది.కాబట్టి అందరికి తెలియజేసి వారివి కానివి ఏమైనా ఉంటే తొలగించుకునేందుకు సహాయం చేయగలరని ఆశిస్తున్నాను.
THANK YOU
0 Comments