Ammavodi Elegible List-2022
అర్హత ఉన్న వారికి ekyc ఎలా చేయాలో చెప్పుకుందాం.
అమ్మఒడి కి సంబంధించి సచివాలయం నందు ఎలిజిబుల్ లిస్ట్ మరియు రీ వెరిఫికేషన్ లిస్ట్ విడుదల అవడం జరిగింది. కానీ ఈ లిస్ట్ కి మాత్రం ప్రత్యేకంగా
NBM (NAVASAKAM BENEFICIARY
MANAGEMENT)పేరుతో ఒక క్రొత్త వెబ్సైట్ ఇవ్వడం జరిగింది.దీనికి సంబంధించిన లింక్ కూడా ఈ పేజీ లో ఇస్తాను,చెక్ చేసుకోండి
గమనిక: ఈ లిస్ట్ డౌన్లోడ్ చేసుకోవడానికి DA/WEA కి మాత్రమే అవకాశం ఇచ్చి వున్నారు.
సచివాలయ సిబ్బందికి సిటిజన్ ఔట్రీచ్ యాప్ లో భాగంగా క్రొత్త వెర్షన్ 4.9 గా ఇచ్చారు.ఈ యాప్ నందు అమ్మఒడి కి సంబంధించిన అర్హుల లిస్ట్ మరియు అనర్హుల లిస్ట్ ఈ యాప్ లో ఇవ్వడం జరిగింది.అర్హుల జాబితాపై క్లిక్ చేసి ekyc తీసుకోవాలి.అనర్హుల జాబితా గురించి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
ఇప్పుడు సచివాలయ సిబ్బంది కి ఇచ్చిన యాప్ లో ఎలాంటి వివరాలు ఉన్నాయో..చూసి వాటికి ekyc ఏ విధంగా చేస్తారో తెలుసుకుందాం.
STEP 1: మొదట పేజీ లో సచివాలయ సిబ్బంది యొక్క ఆధార్ తో లాగిన్ అవ్వాలి.తర్వాత పేజీలో ఈ క్రింది ఫోటో లో చూపిన విధంగా అమ్మఒడి అనే క్రొత్త ఆప్షన్ వచ్చింది.దాని మీద క్లిక్ చేయాలి.
STEP 2: మరొక పేజీ నందు రెండు ఆప్షన్స్ ఇచ్చివున్నారు.అందులో Ammavodi Data అని మరియు Search అనే ఆప్షన్స్ ఉన్నాయి.
STEP 3 : పై ఆప్షన్ లో Ammavodi Data పై క్లిక్ చేస్తే మరొక పేజీ నందు సచివాలయ కోడ్ మరియు క్లస్టర్ నెంబర్ ఎంచుకుని సబ్మిట్ చేసై అర్హులు,అనర్హులు వివరాలు వస్తాయి.
STEP 4 : పై పేజీ లో చెప్పిన విధముగా Search ఆప్షన్ ఎంచుకుంటే అక్కడ 3 రకాల వివరాల ద్వారా జాబితా తెలుసుకునేటట్టు డిజైన్ చేశారు.
- Mother Adhar Number
- Student Adhar Number
- Student ID
STEP 5: ఈ పేజీ నందు స్టూడెంట్ వివరాలు అన్నీ వస్తాయి.ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే ఒకవేల స్టూడెంట్ ఆధార్ దగ్గర సున్నా ఉంటే ఇప్పుడు సచివాలయ సిబ్బంది కరెక్టు నెంబర్ ఎంటర్ చేసే అవకాశం ఉంది.అన్నీ అయ్యాక Select Beneficiary Status ఆప్షన్ దగ్గర LIVE అని సెలెక్ట్ చేసుకుంటే ఆ తల్లి దగ్గర బయోమెట్రిక్ తీసుకోవాలి.
STEP 6: ఈ పేజీ నందు ఒక వేల Select Beneficiary Status దగ్గర Death అని పెట్టినట్లు అయితే ఆ సచివాలయ సిబ్బంది బయోమెట్రిక్ వేసి కన్ఫర్మ్ చేస్తాడు.
ఇంతటితో Ekyc ప్రక్రియ ముగుస్తుంది.
అనర్హులు జాబితా : ఈ అనర్హులు జాబితా గురించి వాళ్ళకి మళ్లీ అర్హత సాధించేందుకు ఎలాంటి అవకాశాలు ఉన్నాయో..క్లారిటీ ఇవ్వలేదు. మరొక అప్డేట్ లో ఇచ్చే అవకాశం ఉంది. ఆ అప్డేట్ వచ్చాక మిగతా వివరాలు తెలియజేస్తాను.
BOP APP V 4.9 : DOWNLAOD
Eligible list : CLICK HERE
SOP PDF LINK : DOWNLOAD
DASHBOARD : CLICK HERE
WATSPP : JOIN
0 Comments