అమ్మఒడి పథకం లో సందేహాలకు ప్రభుత్వం ఇచ్చిన 30 సమాదానాలు
అందరికి నమస్కారం..నేను మీ మునిరత్నం,ముందుగా ఈ సంవత్సరానికి సంబంధించిన అమ్మఒడి పథకం లో అర్హులైన లబ్ధిదారుల వివరాలు మరియు రీ వెరిఫికేషన్ లిస్ట్ అయితే క్రొత్త NBM (Navasakam Beneficiary Management) వెబ్సైట్ లో రిలీజ్ కావడం జరిగింది. దీని గురించి పూర్తి వివరాలు కావాలంటే ఈ క్రింది లింక్ ఓపెన్ చేసి తెలుసుకోవచ్చును.
LINK : Click Here
అర్హుల లిస్టు లో పేర్లు రాకపోవడానికి ప్రభుత్వం చెప్పిన 19 కారణాలు గురించి తెలుసుకోవాలంటే ఈ క్రింది లింక్ ఓపెన్ చేసి తెలుసుకోండి.
VIDEO : Click Here
ఈ రోజు ఈ పోస్ట్ నందు ప్రధానంగా ఎవరికైతే అర్హుల లిస్ట్ యందు పేర్లు రాలేదో, దానికి తగిన కారణాలు కు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా 30 సందేహాలకు సమాధానాలు చెప్పడం జరిగింది.దానికి సంబంధించిన PDF కూడా ఈ పేజీ లో ఇస్తాను,చెక్ చేసుకోండి.
ప్రదానంగా ఎక్కువ మందికి వచ్చిన సందేహాలు ఒక 18 తీసుకొని చెప్పుకుందాం.
1. విద్యార్థి తల్లి మరణించినప్పుడు ఈ BOP యాప్ లో ఫైనల్ గా ఎవరు బయోమెట్రిక్ వేయాలి..?
జ) సచివాలయ వెల్ఫేర్ సెక్రటరీ లేదా ఎడ్యుకేషన్ సెక్రటరీ మాత్రం బయోమెట్రిక్ వేయాలి,వాలంటీర్ వేయకూడదు.
2.తల్లి పేరు తప్పుగా ఉన్నా లేక ఖాళీగా ఉంది.కానీ ఆధార్ నెంబర్ కరెక్టు గా ఉన్న వాళ్లకు బియోమెట్రిక్ ఎలా చేయాలి ?
జ) ఆధార్ నెంబర్ కరెక్టు గా ఉంటే చాలు, పేరు తప్పుగా ఉన్న పర్లేదు ekyc చేయచ్చు.
3.తల్లి మరియు విద్యార్థి యొక్క ఆధార్ ఒకటిగా వచ్చిన వారికి ఏమి చేయాలి?
జ) మొదటగా తల్లి దగ్గర ekyc తీసుకోవాలి..ఆ తరువాత సచివాలయంలో NBM పోర్టల్ లో గ్రీవెన్స్ ద్వారా ఆధార్ ని కరెక్ట్ చేయండి.
4. తల్లి మరియు పిల్లలు వేర్వేరు రైస్ కార్డ్ లో వున్నారు.వారు అర్హులా.. కదా..?
జ) అలాంటి వారు అర్హులు.దీనితో పాటు ప్రధానంగా ఆ తల్లి ఉన్న కార్డ్ కుటుంబం ఆరు దశల వెరిఫికేషన్ లో అర్హులై ఉంటే సరిపోతుంది.
5) అంగన్వాడీ వర్కర్క్స్, ఆశా వర్కర్స్, సానిటరీ వర్కర్స్ ఈ అమ్మఒడి పథకానికి అర్హులా..కదా..?
జ. పై వారందరూ ఈ జగనన్న అమ్మఒడి పథకానికి అర్హులు
6.తల్లి ఆధార్ నెంబర్ ఖాళీ గా ఉంటే ఏమి చేయాలి..?
జ) BOP యాప్ లో ఆధార్ 0 ఉన్నవారికి మాన్యువల్ గా ఎంటర్ చేసి EKYC చేయవచ్చును.
7.తల్లి మరణిoచినప్పుడు తండ్రి వివరాలు కానీ లేదా గార్డియన్ వివరాలు కానీ నమోదు చేయవచ్ఛా..?
జ) ప్రస్తుతం అలాంటి ఆప్షన్ లేదు.చనిపోయినట్టు నిర్దారించి
సచివాలయ ఉద్యోగి దగ్గర ekyc చేయించేసి,తర్వాత NBM లో గ్రీవెన్స్ పెట్టుకోమని చెప్పడం జరిగింది.
8. తల్లికి EKYC తీసుకునేప్పుడు బయోమెట్రిక్ గానీ IRISH ద్వారా కానీ అథoటికేషన్ కానప్పుడు ఏమి చేయాలి..?
జ) ఈ కారణాన్ని తెలుపుతూ NBM సైట్ గ్రీవిన్స్ పెట్టుకోండి.తర్వాత చివర్లో నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నారు.
9.తల్లి ప్రస్తుతం విదేశాలలో కానీ వేరే రాష్ట్రం లో గానీ ఉన్నవారికి EKYC ఎలా చేయాలి..?
జ) ఈ కారణాన్ని తెలుపుతూ NBM సైట్ గ్రీవిన్స్ పెట్టుకోండి.తర్వాత చివర్లో నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నారు.
10.ఒకవేళ విద్యార్థి చనిపోయి ఉంటే ఏమి చేయాలి..?
జ) ఆ పేరుకు EKYC చేయకుండా రిజెక్ట్ చేయాలి.
11. ekyc తీసుకునేటప్పుడు పొరపాటున Death పెట్టేసి ఉంటే ఇప్పుడు ఏమి చేయాలి..?
జ) Search ఆప్షన్ ద్వారా తల్లి ఆధార్ ఆధార్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మరలా LIVE అని పెట్టి eKyc చేయవచ్చును.
12.తల్లి మరియు పిల్లలు ఒకే హౌస్ మాపింగ్ లో లేకుంటే అర్హులు కదా..?
జ) హౌస్ మాపింగ్ లో ఇద్దరూ లేకపోయినా రైస్ కార్డ్ లో ఇద్దరూ ఉంటే అర్హులే అని ప్రభుత్వం చెప్పడం జరిగింది.
13. తల్లి మరియు పిల్లలు ఒకే రైస్ కార్డ్ లో లేకపోతే ఎలా..?
జ) అలాంటి వాళ్ళు ఖచ్చితంగా అర్హులే.కానీ ప్రభుత్వం చెప్పినట్టు నిజాయితీగా ఉంటే ఎలిజిబుల్ చేయచ్చు,అని చెబుతున్నారు.
14. అమ్మఒడిలో అర్హత వున్నా అర్బన్ ప్రాపర్టీ మరియు భూమి ఎక్కువగా ఉంది అని తప్పుగా వచ్చి ఉంటే ఎమి చేయాలి..?
జ) అలాంటి వారు మరలా రివిజన్ పిటిషన్ ని NBM పోర్టల్ ద్వారా గ్రీవెన్స్ పెట్టుకుని మళ్లీ కొలతలు తీసుకుని డేటా ని అప్లోడ్ చేస్తారు.
15. కరెంట్ బిల్లు లు కూడా తప్పుగా వేరే వారివి లింక్ అయి ఉంటే అలాంటివారు ఏమి చేయాలి..?
జ) దీనికి సంబంధించి NBM పోర్టల్ నందు గ్రీవెన్సు రైజ్ చేసుకుని ఆధార్ డీ సీడింగ్ ద్వారా సరిచేసుకోవాలి.
16. BOP యాప్ లో పేరు మొబైల్ నెంబర్ తప్పుగా ఉంటే ఎలా సరి చేసుకోవాలి.
జ. సచివాలయంలో DA/PS లాగిన్ ద్వారా ఓల్డ్ పోర్టల్ అప్డేట్ చేసుకోవాలని తెలియజేసివున్నారు.
17. విద్యార్థి సక్రమంగా స్కూల్ కి వెళ్లినా కూడా హాజరు విషయం లో తక్కువగా చూపిస్తుంటే ఏమి చేయాలి..?
జ) NBM పోర్టల్ ద్వారా గ్రీవెన్స్ పెట్టుకోవాలి.
18. ఆరు దశల వెరైఫికేషన్ లో అర్హులైనా కూడా BOP యాప్ లో గానీ లేదా NBM పోర్టల్ అర్హుల జాబితా లేదా రీ వెరిఫికేషన్ లిస్టు లో పేర్లు రాని వారు ఏమి చేయాలి..?
జ) BOP యాప్ లో చైల్డ్ ID తో సెర్చ్ చేసి చూడాలన్నారు.అక్కడ కూడా రాకపోతే గ్రీవెన్స్ ఆప్షన్ లో "Child Is Eligible but Details not round in both lists"..అనే ఆప్షన్ ఎంచుకోవాలి.
ప్రభుత్వం చెప్పిన 30 సమాధానాలు PDF కావాలంటే ఈ క్రింది లింక్ క్లిక్ చేసుకుని డౌన్లోడ్ చేసుకోండి
User Manual : DOWNLOAD
Adhaar Link Form : DOWNLOAD
Join Watsapp Group : Click Here
0 Comments