ఈ పేజీ లో జగనన్న విద్యా దీవెనకి సంబంధించి ప్రభుత్వం ప్రకటించిన నూతన విషయాలు గూర్చి చర్చించుకుందాం.
1.మరో విడతలో ఫీజుని ఎప్పుడు జమ చేయనున్నారు ?
2.ప్రాథమిక అర్హులు,అనర్హులు లిస్ట్ ఎప్పుడు విడుదల అవుతుంది
3.E Kyc ఎప్పుటి నుండి వేయాల్సి ఉంటుంది ?
4.ఫైనల్ అర్హత లిస్ట్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది ?
మరెన్నో నూతన అప్డేట్స్ పొందాలి అనుకుంటే ఈ క్రింది వాట్సాప్ గ్రూప్ నందు జాయిన్ అవగలరు.
Also Read : ఇళ్ల పట్టాలకు ఈ జులై నెలలో ekyc ఎలా చేసుకోవాలో తెలుసుకోండి
మరో విడతలో ఫీజుని ఎప్పుడు జమ చేయనున్నారు ?
ఈ సంవత్సరం ఏప్రిల్, మే, జూన్ కి సంబంధించిన ఫీజుని ఆగస్ట్ నెలలో వేయనున్నారు.
ప్రాథమిక అర్హులు,అనర్హులు లిస్ట్ ఎప్పుడు విడుదల అవుతుంది ?
ప్రభుత్వం దీనికి సంబంధించి ఒక కాల పట్టిక కూడా విడుదల చేయడం జరిగింది. అందులో చెప్పిన విధంగా జులై 7 వ తేదీ సచివాలయం లో లిస్ట్ పెట్టి, అక్కడ అనర్హత వచ్చిన వారికి జులై 8 నుండి జులై 13 వ తేదీ వరకు నోటీస్ లు కూడా జారీ చేస్తారు.
గ్రీవెన్స్ కి ఎప్పుడు పెట్టుకోవచ్చు ?
ఒకవేళ ఆ విద్యార్థి సోషల్ ఆడిట్ లో అనర్హత అని తేలితే నోటీసులు జారీ చేస్తారు.అక్కడ ఒకవేళ ఆ నోటీస్ లో చెప్పిన కారణం తప్పు అని బావిస్తే దానికి సంబంధించిన డాకుమెంట్స్ తో సచివాలయం లో ఈ జులై 8 వ తేదీ నుండి 25 వ తేదీ వరకు అవకాశం ఇచ్చివున్నారు.కాబట్టి ఈ అవకాశాన్ని విద్యార్థులు ఉపయోగించుకోవలెను.
Also Read: వ్యాపారానికి లోన్ కావాలంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోండి
E Kyc ఎప్పుటి నుండి వేయాల్సి ఉంటుంది ?
పథకం ప్రారంభానికి ముందు ఒకసారి విద్యార్థుల దగ్గర బయోమెట్రిక్ తీసుకోవడం మాములే. అందులో భాగంగానే ఈ విడతకి సంబంధించి జులై 12 వ తేదీ నుండి 30 వ తేదీ వరకు సచివాలయ ఉద్యోగులు వచ్చి ekyc తీసుకుంటారు.
ఫైనల్ అర్హత లిస్ట్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది ?
ఈ నెల అంటే జులై 30 వ తారీఖున సచివాలయం నందు ఫైనల్ అర్హత లిస్ట్ మరియు అనర్హత లిస్ట్ నోటీస్ బోర్డ్ నందు అందుబాటులో ఉంచుతారు.కాబట్టి ఈ లిస్ట్ లో పేరు వచ్చినవారికి మాత్రమే ఆ తల్లుల ఖాతాలో డబ్బులు జమ అవుతాయి.
Also Read: అమ్మఒడి లో డబ్బులు పడకపోవడానికి 13 కారణాలు తెలియజేసిన అధికారులు
0 Comments