ఈ పేజీలో మనం ఇప్పుడు YSR పెన్షన్ష్ కి సంబంధించి ఈ క్రింది విషయాలు చర్చించుకుందాం.
1)ఎటువంటి లాగిన్ లేకుండా మీ గ్రామంలో గానీ వార్డ్ లో గానీ ఎంతమంది పెన్షన్ తీసుకుంటున్నారో చెక్ చేసుకునే విధానము
వైస్సార్ పెన్షన్ కానుక: ఆంద్రప్రదేశ్ నందు ఇప్పటికే JULY 2022 నాటికి దాదాపు 60 లక్షల పెన్షన్లు ను వాలంటీర్ సహాయం తో పెన్షన్ష్ దారుల ఇంటివద్దకే సూర్యోదయం మొదలవ్వగానే వారి చేతిలో డబ్బులను పెడుతున్నారు.ఇదే కాకుండా ఇంకా ఆగస్ట్,2022, 1వతేదీ నుండి క్రొత్తగా రాష్ట్ర ప్రభుత్వం 3 లక్షల పెన్షన్స్ ని ఇవ్వబోతున్నారు. ఇంత పెద్ద మొత్తంలో పెన్షన్ దారుల సంఖ్య పెరగడానికి ప్రధాన కారణం YSRCP అధికారం లోకి రాగానే పెన్షన్ అర్హత వయస్సు 65 నుండి 60 కి తగ్గించడం, మరియు అర్హత రాగానే వాలంటీర్ ద్వారా సచివాలయం లో దరఖాస్తు చేసుకోగా సంవత్సరం లో రెండు సార్లు అంటే జూన్, డిసెంబర్ నెలలో శాంక్షన్ చేసే అవకాశం కల్పించారు.దీనివల్లనే అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్స్ మంజూరు అవుతున్నాయి.
Also Read: ఇళ్ల పట్టాలకు ఈ జులై నెలలో ekyc ఎలా చేసుకోవాలో తెలుసుకోండి.
![]() |
EKYC |
Also Read : అమ్మఒడి లో డబ్బులు పడకపోవడానికి గల కారణానాలను అధికారకంగా సమాచారం ఇచ్చారు.
Ysr పెన్షన్ ఎటువంటి లాగిన్ లేకుండా పారదర్శకంగా ఎవ్వరైనా మీ గ్రామంలో గానీ వార్డ్ లో గానీ ఎంతమంది పెన్షన్ తీసుకుంటున్నారో చెక్ చేసుకునే విధానము
దీనికి సంబంధించి ఎటువంటి లాగిన్ గానీ, పెన్షన్ నెంబర్ గానీ అవసరం లేకుండానే మీ గ్రామంలో/ వార్డ్ లో పెన్షన్ దారుల వివరాలును ఈ పేజీ లో చివరన ఇచ్చిన లింక్ ఓపెన్ చేయగా పేజీ ఈ క్రింది విధంగా వస్తుంది.
STEP 2: పై పేజీలో మొదట్లోనే పెన్షన్ ఐ.డి లేదా గ్రీవెన్స్ ఐ.డి అని రెండు ఆప్షన్స్ వస్తాయి.అందులో మొదట Pension ID ఆప్షన్ ఎంచుకున్నాక అలాగే క్రిందకు వస్తే అక్కడ ఈ క్రింది చెప్పిన వివరాలు ఇస్తే సరిపోతుంది.
- మీ క్రొత్త జిల్లా ని ఎంచుకోవాలి
- మీ మండలాన్ని ఎంచుకోవాలి
- మీ పంచాయతీ ని ఎంచుకోవాలి
- మీ గ్రామం / వార్డు ని ఎంచుకోండి
దాని క్రింద GO అనే బట్టన్ పై క్లిక్ చేయండి.
STEP 3: ఈ పేజీ నందు 2006 వ సంవత్సరం నుండి మీ గ్రామంలో ఎంతమందికి పెన్షన్ష్ Sanctioned అయ్యింది,ఆ తరువాత వివిధ కారణాల వలన ఎన్ని Delete అయ్యాయి.ఇప్పుడు ఇంకా ఎంతమంది LIVE లో పెన్షన్ పొందుతున్నారు మరియు ఏ రకమైన పెన్షన్ పొందుతున్నారు అనే సమాచారం మనకు ఎటువంటి లాగిన్ లేకుండా పారదర్శకంగా ఎవ్వరైనా తెలుసుకునే వెసులుబాటు కల్పించింది.
0 Comments