Header Ads Widget

క్యాస్ట్ & ఇన్కమ్ సర్టిఫికెట్స్ ఇంకా రాని వారికి అవకాశం (Re Issuance Certificate)-2022



Re-Issuance Certificate

క్యాస్ట్ & ఇన్కమ్ సర్టిఫికెట్స్ ఇంకా రాలేదా...అలాంటి వారికి ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఒక మంచి అవకాశం ఇచ్చారు.అదేంటో వివరంగా ఈ పేజీ లో తెలుసుకుందాం.

ప్రభుత్వ పథకాలపై ఏ సందేహం వున్నా ఈ క్రింద ఇచ్చిన వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యి ఎప్పటికప్పుడు సమాచారం పొందుతూ ఉండచ్చు





ముఖ్యంగా ఇప్పుడు YSR చేయూత పతకం కి సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన నిబంధనలు ప్రకారం ఈ 2022 సంవత్సరం నందు AP సేవా పోర్టల్ లో దరఖాస్తు చేసి ప్రింట్ తీసుకున్నది మాత్రమే చెల్లుబాటుగా ప్రకటించారు.కాబట్టి గత సంవత్సరం తీసుకున్న సర్టిఫికెట్స్ వున్నా కూడా చెల్లుబాటు కాకుండా పోయింది.దీంతో ప్రజలు సరైన సమయానికి పథకాల కోసం సర్టిఫికెట్స్ అందించలేక పోతున్నారు.దీనిని గమనించిన ప్రభుత్వం ఒక మంచి అవకాశం ఇచ్చింది.


అసలు విషయం: గతంలో తీసుకున్న సర్టిఫికెట్స్ అంటే అది మీసేవ లో తీసుకున్న సర్టిఫికెట్ అయినా, లేదా సచివాలయంలో తీసుకున్న సర్టిఫికెట్ అయినా ఈ సంవత్సరం క్రొతగా దరఖాస్తు చేయకుండానే ఈ సంవత్సరం ఇచ్చినట్టుగానే ప్రింట్ తీసుకునే అవకాశం(Re-Issuance Certificate)వెసులుబాటు కల్పించారు.కావున ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని సకాలంలో సంక్షేమ పథకాలు లబ్ధి పొందగలరు.


దీనికి ఎంత ఫీజు చార్జీ చేస్తారు..?

ప్రభుత్వం ఇచ్చే Re Issuance Certificate కొరకు కేవలం 15 నిమిషాల్లో రూ.40 ఫీజు తో క్రొత్త సర్టిఫికెట్ ప్రింట్ తీసి ఇస్తారు.


ప్రజలు గుర్తించుకోవాల్సిన ముఖ్య అంశం

ప్రజలు ఈ సర్టిఫికెట్ ప్రింట్ తీసుకోవాలంటే గత సర్టిఫికెట్ ఆధార్ కి లింక్ అయి ఉండాలి.


సచివాలయంలో ఈ Re Issuance Certificate ఎవరి లాగిన్ లో ఏ ఆప్షన్ ద్వారా ప్రింట్ తీసుకోవచ్చు.


ఈ క్రింది లింక్ ద్వారా ప్రింట్ తీసి ఇస్తారు







STEP 1: పైన ఇచ్చిన లింక్ ద్వారా సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ లాగిన్ అవుతారు.


STEP 2: Services ఆప్షన్ లో Re-Issuance Certificate ఆప్షన్ పై క్లిక్ చేస్తారు.




STEP 3: ఇక్కడ ఆధార్ ఎంటర్ చేసి Pre-Fill చేస్తే వివరాలు వస్తాయి.




STEP 4: చివరన Rs.40 రూపాయలు చెల్లించి అప్పటికప్పుడే ప్రింట్ తీసి ఇస్తారు.






అక్కడ ఇచ్చే సర్టిఫికెట్ AP సేవా పోర్టల్ లో తీసుకున్నట్టు మరియు ఈ సంవత్సరం తీసుకున్నట్టు వస్తుంది.కావున అన్ని పథకాలకు దీనిని ఉపయోగించుకుని లబ్ది పొందవచ్చును.

Post a Comment

0 Comments