Online Complaint Registration in Jaganannaki Chebudam Portal
ఈ రోజు ఈ పేజీ నందు చెప్పుకోబోయే ప్రధానాంశాలు
1) Introduction (పరిచయం)
2) మన సమస్యని ఎన్ని విధాలుగా ప్రభుత్వానికి చెప్పుకోవచ్చును?
3) Online లో సమస్యని రిజిస్టర్ చేయు విధానము?
4) గ్రీవెన్స్ స్టేటస్ చెక్ చేసుకోవడం
5) Conclusion
6) మరిన్ని సందేహాల నివృత్తి కొరకు ఎలా?
1) Introduction (పరిచయం)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నందు ప్రభుత్వానికి సంబంధించిన ఎటువంటి సర్వీసులు అయినా ప్రజలకు హక్కుగా అందచేయాలి అనే కాన్సెప్ట్ తోనే ప్రజలకు సేవ చేయడానికి ప్రభుత్వ ఉద్యోగులను నియమించి వారికి జీతాలు కూడా ఇస్తుంటారు.కానీ ప్రతి డిపార్ట్మెంట్లో ఎవరో కొంతమంది ఉద్యోగులు, ప్రజలకు ఏదో వాళ్ళు ఉచితంగా సేవ చేస్తునట్టు భావించి,వారికి అర్హత వున్నా కూడా కొని పనులు సకాలంలో చేయక ఇబ్బంది పెడుతూ వుంటారు.అలాంటప్పుడు ప్రజలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఇబ్బంది పడుతూ వుంటారు.అలాంటి సమస్యల పరిష్కారం కోసమే ప్రభుత్వాలు ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చి, మాకు కాల్ చేసి మీ సమస్య చెప్పుకుంటే మీకు అర్హత ఉంటే నిర్ణీత సమయంలో మీకు ఒక తేదీ కేటాయించి,ఆ తేదీ లోపల మీ సమస్య క్లియర్ అయ్యే విధంగా చేస్తున్నారు.
ఈ భావనతోనే 2014 సంవత్సరం లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం కూడా 1100 అనే నెంబర్ ని ప్రజలకు ఇచ్చి తద్వారా ప్రజా సమస్యల కొరకు కాల్ చేసి ప్రభుత్వానికి తెలియజేస్తే ప్రజా సమస్యలు క్లియర్ అయ్యే విధంగా చేసేవాళ్ళు.అదే విధంగా ఇప్పటి ప్రభుత్వం ఇంకా కొంచెం పారదర్శకంగా తీసుకుని ప్రజలు సులభరీతిలో 1902 అనే Toll free నెంబర్ కి కాల్ చేస్తే మీ సమస్య ని అక్కడే రిజిస్టర్ చేసి సంబంధిత అధికారికి బదిలీ చేసి,దానితోపాటు ముఖ్యంగా ఒక Timeline కేటాయించి ఆ తేదీ లోపల మీ సమస్యకి పరిస్కారం చూపే విధంగా తేవడాన్నే "స్పందన కార్యక్రమమం" అనేవాళ్ళు.తర్వాతి రోజుల్లో దీనికి పేరు మార్చి "జగనన్నకి చెబుదాం" అని పేరు కూడా మార్చడం జరిగింది.
గమనిక - ఒకసారి పెట్టిన అప్లికేషన్ లో మీ సమస్య క్లియర్ అయిందని అధికారులు చెప్పినా, మీరు సంతృప్తి చెందకపోతే మళ్ళీ రెండవసారి కూడా పై అధికారులకు సమస్య చెప్పుకునే అవకాశాన్ని ఇవ్వడం జరిగింది.
2) మన సమస్యని ఎన్ని విధాలుగా ప్రభుత్వానికి చెప్పుకోవచ్చును?
ప్రజలు సమస్యని ముఖ్యంగా 5 రకాలుగా చెప్పుకోవచ్చును.
1) 1902 అనే నెంబర్ కి కాల్ చేసి సమస్య తెలియజేయవచ్చును
జ) ఏ మొబైల్ నుండి అయినా 1902 నెంబర్ కి కాల్ చేస్తే అక్కడ ఉద్యోగి మీ సమస్యను విని,తగిన పరిష్కారం తెలియజేస్తారు.ఒక వేల మీ సమస్య తీవ్రత ఎక్కువగా వున్నట్లైయితే మీ ఆధార్ నెంబర్అడిగి అక్కడే రిజిస్టర్ కూడా చేస్తారు.ఆ తర్వాత మీ సమస్యకి సంబధించిన ఉద్యోగి మీ ఇంటి వద్దకు వచ్చి అర్హత ఉంటే మీ సమస్యకి పరిష్కారం చూపుతారు.ఆ తరువాత ప్రభుత్వం నుండి మీకు ఫోన్ చేసి మీ సమస్య పరిష్కారం అయినందుకు సంతృప్తి చెందుతున్నారా అని అడుగుతారు.అక్కడ మీ సమస్య క్లియర్ అయుంటే అయింది అని చెప్పగలరు,లేదంటే మా సమస్య పరిష్కారం కాలేదు అని చెప్పినట్లయితే మీ కంప్లైంట్ ని జిల్లా కలెక్టర్ కి ఫార్వర్డ్ చేస్తారు.ఆ తరువాత మళ్ళీ ఉన్నత అధికారులు వచ్చి మీ సమస్యకి పరిష్కారం చేస్తారు.
2) డైరెక్ట్ గా ముఖ్యమంత్రికి గానీ లేదా CM ఆఫీస్ కి గానీ సమస్యని తెలియ జేయవచ్చును.
ఇక్కడ 1902 నెంబర్ కి కాల్ చేసి అక్కడ ఉద్యోగికి మేము ముఖ్యమంత్రి గారితో మాట్లాడాలి,అని వాళ్లకు చెప్పినట్లయితే కొంతసేపు వేచి వుండండి అని చెప్పి కాల్ కనెక్ట్ చేస్తారు.అక్కడ Beep అనే సౌండ్ తర్వాత 1 నిమిషం పాటు సైలెంట్ గావుంటుంది.కనుక అక్కడ మీ సమస్యని ముఖ్యమంత్రు గారికి తెలియజేయాల్సి ఉంటుంది.
3) మీ జిల్లా కలెక్టరేట్ లో సమస్య చెప్పుకునే విధానము
మీ జిల్లాలోని కలెక్టర్ కార్యాలయంలో ప్రతి సోమవారం ఈ జగనన్నకి చెబుదాం అనే కార్య క్రమం జరుగును.కావున అక్కడకు వెళ్లి మీ సమస్యని ఒక అర్జీ రూపంలో వ్రాసుకుని తెలియజేయవచ్చును.
4) మీ సచివాలయంలో సమస్య చెప్పుకునే విధానము
మీ గ్రామంలో వున్న మీ సచివాలయంలో కూడా ప్రతి రోజు మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మీ సమస్యలను రిజిస్టర్ చేయుటకు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి సచివాలయం లోని అందరూ సిబ్బంది అందుబాటులో వుంటారు.కానీ ఇలాంటి సర్వీసు ఉందనే విషయాన్నే ప్రజలకు తెలియనీయడం లేదు.బహుశా మన పోస్ట్ చూసాక అయినా ప్రజలు ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను.
5) Online లో మనమే మన ఆధార్ నెంబర్ తో సమస్యని రిజిస్టర్ చేయవచ్చు.
5) Online లో సమస్యని రిజిస్టర్ చేయు విధానము?
Step 1 - ఈ క్రింది లింక్ ఓపెన్ చేసుకోగలరు.అక్కడ పేజీ లో Login అనే ఆప్షన్ ఉంటుంది.దాని మీద క్లిక్ చేసుకోవాలి.
గమనిక- మొబైల్ లో ఓపెన్ చేసుకునేవాళ్ళు ఉంటే ఎడమ ప్రక్కన 3 lines ఉంటాయి.వాటి మీద క్లిక్ చేస్తే Login అనే ఆప్షన్ కనిపిస్తుంది.
Website Link - Click Here
Step 2 - ఇక్కడ citizen లాగిన్ పై క్లిక్ చేసుకున్నాకా మీ ఆధార్ నెంబర్ ఇచ్చి OTP ఎంటర్ చేసుకుని Verify చేసుకోవాలి.
Step 3 - ఈ పేజీలో మన వ్యక్తిగత వివరాలు కొన్ని మనమోదు చేయాల్సి వస్తుంది.అక్కడే కొంచెం క్రిందకు వస్తే Individual / Community అనే ఆప్షన్ దగ్గర Individual అనే ఆప్షన్ ని ఎంచుకోవాలి.
Step 4 - ఇక్కడ కొంచెం క్రిందకు రాగానే ఈ Grievance Information/ ఫిర్యాదుల సమాచారము అనే ఆప్షన్ వస్తుంది.ఇది చాలాముఖ్యమైన అంశం. ఎందుకంటే మీ సమస్యని ప్రభుత్వానికి చెప్పేటప్పుడు Search for a Sub Subject అనే Box వద్ద మీ సమస్య ని క్లుప్తంగా ఎంటర్ చేస్తే సంబంధిత డిపార్ట్మెంట్ కి అదే తీసుకెళ్తుంది.లేదా మీకు మీ సమస్య ఏ డిపార్ట్మెంట్ ధో తెలిస్తే క్రిందనే Departments కూడా ఎంచుకోవచ్చు.ఆ తరువాత ఆ డిపార్ట్మెంట్ కి సంబంధించి మీ సమస్య రకాన్ని కూడా ఎంచుకోవాల్సి ఉంటుంది.
Step 5 - కొంచెం క్రిందకు వస్తే ఇక్కడ Source Type/అర్జీ నమోదు రకము అనే ఆప్షన్ దగ్గర Online User అనే ఆప్షన్ ని ఎంచుకోవాలి.
Step 6 - ఇక్కడ చివరగా Remarks అనే ఆప్షన్ దగ్గర మీ సమస్యని క్లుప్తంగా వ్రాయవచ్చును.ఆ తరువాత Submit చేసినట్లయితే మీ మొబైల్ కి గ్రీవెన్స్ నెంబర్ వస్తుంది.దానికి భద్రంగా పెట్టుకోండి, ఎందుకంటే ఆ నెంబర్ సాయంతో మన సమస్య ఎన్ని రోజులలో క్లియర్ చేయనున్నారా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూవుండవచ్చును.
Step 7 - ఇక్కడ మళ్ళీ మీ సమస్యకి సంబంధించిన ప్రూఫ్స్ మరియు మీరు వ్రాసుకున్న అర్జీ ని ఇక్కడ మీ మొబైల్ కి వచ్చిన గ్రీవెన్స్ నెంబర్ ద్వారా లాగిన్ అయ్యి Documents Upload చేయాలి.
4) గ్రీవెన్స్ స్టేటస్ చెక్ చేసుకోవడం
5) మీ సమస్య ఇక్కడ తీరకపోతే ఏమి చేయాలి?
5) Conclusion
0 Comments