AP Free Gas Cylinder Scheme: Complete Details, Eligibility, and FAQs
Introduction - AP Free Gas Cylinder పథకం అనేది ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం పేద కుటుంబాలకు సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఈ పథకం ద్వారా అందించనున్నారు .
AP Free Gas Cylinder Scheme: FAQs (20 సందేహాలు)
1) ఈ Free Gas Cylinder పథకం ద్వారా లబ్ది పొందుటకు ఎవరు అర్హులు ?
జ) ఈ Free Gas Cylinder పథకం అనేది ఈ క్రింది అర్హత వున్న ప్రతి పేద కుటుంబానికి ఇస్తున్నట్టు ప్రభుత్వం తెలియజేస్తున్నది.
అర్హతలు & డాక్యుమెంట్స్
1) ఆ కుటుంబానికి రేషన్ కార్డు ఉండాలి.
2) వినియోగ దారుని ఆధార్ నంబర్.
3) గ్యాస్ కనెక్షన్ కలిగి ఉండాలి.
గమనిక - ఈ Free Gas Cylinder పథకాన్ని గురించి పూర్తి వీడియోని ఈ పేజీ చివరన ఇవ్వడం జరిగింది .
2) ఈ పథకం ద్వారా ఎన్ని సిలిండర్లు ఉచితంగా ఇవ్వనున్నారు ?
జ ) ఈ Free Gas Cylinder పథకం ద్వారా అర్హత కలిగిన కుటుంబాలకు సంవత్సరానికి 3 సిలిండర్లను ఉచితంగా ఇవ్వనున్నారు.
3) ఈ Free Gas Cylinder ని ఎప్పుడెప్పుడు ఇస్తారు ?
జ) ఈ Free Gas Cylinder పథకం ద్వారా ఇచ్చే 3 సిలిండర్లు ఒక ఆర్ధిక సంవత్సరానికి 3 చొప్పున ఇస్తారు .
అవి - ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం 2024-25 చివర్లో వున్నాము, కాబట్టి ఈ మార్చి 31 వ తేదీకి 1 సిలిండర్ కి మాత్రమే అవకాశం ఇస్తారు.
ఇక రాబోయే ఆర్ధిక సంవత్సరం అంటే 2025-2026 నుండి
- ఏప్రిల్ నుండి జులై మధ్యలో బుక్ చేసుకుంటే - మొదట సిలిండర్ ఇస్తారు .
- ఆగష్టు నుండి నవంబర్ మధ్యలో బుక్ చేసుకుంటే - రెండవ సిలిండర్ ఇస్తారు
- డిసెంబర్ నుండి మార్చి మధ్యలో బుక్ చేసుకుంటే - మూడవ సిలిండర్ ఇస్తారు .
ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా 4 నెలలకు ఒక్క సిలిండర్ చొప్పున 3 సిలిండర్లు ఇస్తారు .
4) ఈ Free Gas Cylinder కొరకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
జ) ఈ Free Gas Cylinder పథకం కొరకు ప్రత్యేకంగా అప్లికేషన్ గానీ, వెబ్సైటు గానీ, సచివాలయంలో గానీ లేదా మీసేవ లోగానీ ఎక్కడా కూడా Apply చేసుకోవడానికి వీలు లేదు.కనుక ఎవ్వరి మాటలు నమ్మద్దండి .
మనం సాధారణంగా సిలిండర్ ని ఏ విధంగా అయితే బుక్ చేసుకుంటామో అదే విధంగానే బుక్ చేసుకోవాలి.
5) ఒకే సారి వరుసగా 3 సిలిండర్ల లబ్ధిని పొందవచ్చునా ?
జ) ఈ Free Gas Cylinder పథకంలో వరుసగా నెలకి ఒక్కటి చొప్పున ఒకేసారి 3 ఉచిత సిలిండర్లను పొందే వీలు లేదు, పై ప్రశ్నలో తెలిపిన ప్రకారం ఒక ఆర్ధిక సంవత్సరానికి వాళ్ళు చెప్పిన నెలల మధ్యలో బుక్ చేసుకునే వారికీ మాత్రమే ఈ లబ్ధిని చేకూస్తారు.
6) ఈ Free Gas Cylinder పథకం ద్వారా లబ్ది పొందినట్టు మాకు ఎలా తెలుస్తుంది ?
జ) ఉదాహరణకు ఒక కుటుంభం, పైన తెలిపిన 4 నెలలలో అంటే ఏప్రిల్ నుండి జులై మధ్యలో 2 సిలిండర్లను బుక్ చేసుకున్నారు అనుకుందాం. అలాంటి వారికి 1 సిలిండర్ కి మాత్రమే ఈ Free Gas Cylinder పథకం ద్వారా లబ్ది చేకూరుతుందని వినియోగ దారుని మొబైల్ కి ఒక SMS వస్తుంది.ఆ తరువాత సిలిండర్ కి కట్టిన అమౌంట్ ని పూర్తిగా లబ్ధిదారుని అకౌంట్ కి జమ చేసేస్తారు. మిగిలిన మరొకటి మాత్రం సాధారణంగా ఎలా అయితే గ్యాస్ ఏజెన్సీ లకు డబ్బులు కట్టి తీసుకుంటామో అలాగే తీసుకోవాలి. అయితే ప్రభుత్వం చెప్పిన అదే నెలలో రెండో సిలిండర్ కి బుక్ చేసుకున్నారు కనుక ఈ సబ్సిడీ వర్తించదు.
7) ఈ Gas Cylinder ఇంటికి వచ్చినప్పుడు డబ్బులు కట్టాలా ..వద్దా ?
జ) ప్రభుత్వం చెబుతున్న విధంగా గ్యాస్ సిలిండర్ ఇంటికి వచ్చాక ఆ సిలిండర్ ధర ఎంత అయితే ఉందొ ఆ అమౌంట్ ని లబ్ది దారులు కట్టేయాలి.కట్టేసిన తరువాత 48 గంటల లోపల ఆ లబ్ది దారిని బ్యాంక్ ఖాతాకు DBT సిస్టం ద్వారా డబ్బులు జమ చేస్తారు.
8) మేము ఏమైనా బ్యాంక్ అకౌంట్ జెరాక్స్ ని గ్యాస్ ఏజెన్సీలకు సమర్పించాలా ?
జ ) సాధారణంగా అయితే అవసరం లేదు, ఎందుకంటే ఈ వినియోదారుని యొక్క ఆధార్ నెంబర్ ఏ బ్యాంక్ ఖాతాకు అయితే లింక్ అయ్యి ఉంటుందో దానికి DBT ద్వారా డబ్బులు జమ అయిపోతాయి.
ఒక వేళ మీ గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు రికార్డులు మెయిటైన్ చేయడానికి ఏమైనా అడిగితే ఇవ్వండి.అంతేగాని ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు.
మీ ఆధార్ ప్రకారం ఏ బ్యాంకు లో డబ్బులు పడుతాయో ఈ క్రింది లింక్ ద్వారా చెక్ చేసుకోగలరు.
Payment Status Link - Click Here
ఆధార్ ఏ బ్యాంకు కి లింక్ అయిందో చెక్ చేసుకునే వీడియో లింక్
.
9) Ekyc అయినవారికి మాత్రమే ఈ Free Gas Cylinder పథకం వర్తిస్తుందా?
జ ) ప్రస్తుతానికి అలాంటి నిబంధన అయితే లేదు, కానీ Ekyc అనేది ప్రతి సంవత్సరం కూడా చేయించుకుంటే మంచింది.ఎందుకంటే తద్వారా మన ఆధార్ కార్డు లో వున్న వివరాల ప్రకారం data మొత్తం కూడా అప్డేట్ అయ్యి గ్యాస్ ఏజెన్సీల దగ్గర ఆటోమాటిక్ గా మీ బ్యాంక్ కూడా లింక్ అయిపోతాయి.
10) గ్యాస్ కనెక్షన్ పురుషుల పేరు మీద ఉంటే ఈ Free Gas Cylinder పథకం వస్తుందా ?
జ) ఈ అంశానికి సంబంధించి ప్రభుత్వం నుండి ప్రత్యేకంగా ఏమి ఇప్పటివరకు చెప్పలేదు, కానీ ప్రభుత్వం అర్హత కలిగిన, రేషన్ కార్డు వున్న ప్రతి కుటుంబానికి ఈ Free Gas Cylinder పథకం వర్తిస్తుందని చెప్పారు.
11) ఈ Free Gas Cylinder పథకం కొరకు ఎప్పటి నుండి బుకింగ్ చేసుకోవచ్చు ?
జ) ఈ Free Gas Cylinder పథకం కి సంబంధించి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు వెల్లడించిన అంశాలు ఏమనగా ఈ అక్టోబర్ 29 వతేదీ ఉదయం 10 గంటల నుండి బుక్ చేసుకోవాలి. వారికీ అక్టోబర్ 31 దీపావళి రోజున ఈ పథకం ప్రారంభ రోజునే వారి ఖాతాకు డబ్బులు జమ అవుతాయి. ఒక వేల ఈ తేదీలలో బుకింగ్ పొందలేకపోతే మార్చి 31, 2025 లోపల ఎప్పుడు బుక్ చేసుకున్ననూ 48 గంటలలో ఈ సబ్సిడీ లబ్ది మీకు చేకూరుతుంది.
12) మాకు రేషన్ కార్డు వుంది, కానీ గ్యాస్ కనెక్షన్ లేదు,అయినా కూడా మాకు ఈ పథకం వర్తిస్తుందా ?
జ) ఈ Free Gas Cylinder పథకం అనేది రేషన్ కార్డు ఉండి, గ్యాస్ కనెక్షన్ కూడా వున్న వారికీ మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. కనుక ముందుగా వెళ్లి క్రొత్త కనెక్షన్ కి దరఖాస్తు చేసున్న తరువాత నుండి మీకు కూడా ఈ Free Gas Cylinder పథకం వర్తించనుంది.
13) మా అమ్మ పేరు మీద కనెక్షన్ వుంది,కానీ ప్రస్తుతం ఆమె జీవించి లేదు,కావున మాకు కూడా ఈ Free Gas Cylinder పథకం వర్తిస్తుందా ?
జ) ప్రస్తుతానికి మీరు సాధారణంగా ఎలా బుక్ చేస్తున్నారో అలాగే బుక్ చేసుకుని ఈ Free Gas Cylinder పథకం ద్వారా పూర్తి సబ్సిడీని పొందవచ్చును. కానీ E-KYC చేయమంటే మాత్రం మీకు ఇబ్బంది వస్తుంది కనుక వెంటనే మీ అమ్మగారి డెత్ సర్టిఫికెట్ ఇచ్చి, కనెక్షన్ ని మరొకరి పేరు పైకి మార్చుకోగలరు.
14) సిలిండర్ ఇంటికి వచ్చినప్పుడు ఆ అమౌంట్ ని వేరొకరి బ్యాంకు అకౌంట్ నుండి చెల్లించినచో, మాకు డబ్బులు వస్తాయా. .రావా ?
జ) ఇక్కడ ఒక్కటి గమనించాలి, ఏమిటంటే గ్యాస్ డెలివరీ బాయ్ కి ఎవరి అకౌంట్ ద్వారా అయినా డబ్బులు చెల్లించవచ్చును. కానీ ప్రభుత్వం ఇచ్చే ఈ పూర్తి సబ్సిడీ అమౌంట్ మాత్రం పూర్తిగా లబ్దిదారుని ఖాతాకి మాత్రమే డబ్బులు జమ అవుతాయి.
15) ఈ నెల 24 వతేదీన గ్యాస్ బుక్ చేసుకున్నాము, మాకు కూడా ఈ Free Gas Cylinder పథకం ద్వారా డబ్బులు వస్తుందా ?
జ) ఈ Free Gas Cylinder పథకం గురించి మంత్రి అధికారికంగా చెప్పిన తేదీలు అక్టోబర్ 29 నుండి బుకింగ్ చేసుకున్న వారికోసం మాత్రమే అని చెప్పారు కనుక అంతక ముందు తేదీలలో ఎప్పుడు బుక్ చేసుకున్ననూ ఈ పథకం వారికీ వర్తించదు. కానీ అలాంటి వాళ్ళ కోసం మార్చి 31 / 2025 వరకు అవకాశం వుంది కాబట్టి అప్పటి లోపు మరో సిలిండర్ ని బుక్ చేసుకుని లబ్ది పొందవచ్చును .
16) మాకు రేషన్ కార్డు, ఆధార్ కార్డు లోని చిరునామా ఓక మండలంలో వుంది. గ్యాస్ కనెక్షన్ మాత్రం వేరే మండలంలో వుంది, మాకు ఈ Free Gas Cylinder పథకం వర్తిస్తుందా?
జ) ఖచ్చితంగా వర్తిస్తుంది. ప్రస్తుతం ఎక్కడైతే సిలిండర్ డెలివరీ అవుతుందో ఆ గ్యాస్ ఏజెన్సీస్ వున్న మండలంలోనే లెక్కిస్తారు.
17) ఈ Free Gas Cylinder పథకం నందు ఏమైనా ఇబ్బందులు ఉంటే ఎవరిని సంప్రదించాలి ?
జ) ఈ Free Gas Cylinder పథకం నందు బుకింగ్ సందర్భంలో గానీ, లేదా సబ్సిడీ అమౌంట్ పొందలేక ఇబ్బందులు వున్ననూ రాష్ట్ర ప్రభుత్వం 1967 అనే Toll Free అందుబాటులో ఉంచింది. కనుక ఈ నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యని పరిష్కరించకోవచ్చు.
18) రాష్ట్రము లో సంక్షేమ పథకాలకు ఆరు దశల ధ్రువీకరణ ఇకమీదట వర్తించదు అంటున్నారు అలాంటప్పుడు రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా ఈ Free Gas Cylinder పథకం కి దరఖాస్తు చేసుకోవచ్చా?
జ) ప్రస్తుత వుమ్మడి కూటమి ప్రభుత్వం గత ఎన్నికల ముందు తెలియజేసినట్లు ఇక మీదట రాష్ట్రంలో ఆరు అంచెల విధాన్ని అమలు చేయబోము అన్నారు , అదే విధంగా ఈ Free Gas Cylinder పథకం ని ప్రకటించే క్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ గారు కూడా ఈ విషయాన్ని తెలియజేసాడు, కానీ అలాంటప్పుడు మిగిలిన కుటుంబాలు ఈ Free Gas Cylinder పథకం కి కూడా అర్హత సాధించినట్టే , కానీ ప్రభుత్వం ప్రత్యేకంగా రేషన్ కార్డు వున్న వారికే అని తెలియజేశారు కాబట్టి ఈ ఆరు దశల ధ్రువీకరణ విధానాన్ని ఈ పథకానికి వర్తింపజేసినట్లు కనిపించలేదు, బహుశా క్రొత్త రేషన్ కార్డుల జారీ సమయాన ఈ ఆరు దశల ద్రువీకరణని పరిగణలోకి తీసుకోకుండా రేషన్ కార్డు ఇచ్చి, ఆ తరువాత అన్నీ సంక్షేమ పథకాలను ఆ కుటుంబాలకు కూడా లబ్ది చేకూర్చే అవకాశం కలదు.
19) మా కుటుంబంలో రెండు వేర్వేరు కంపెనీలకు సంబంధించిన గ్యాస్ కనెక్షన్స్ వున్నాయి, రెండిటికి ఈ Free Gas Cylinder పథకం వర్తిస్తుందా?.
జ) ఈ Free Gas Cylinder పథకం అనేది ప్రభుత్వం చెప్పినట్టు వారు సూచించిన గడువు తీరిన నెలలో మాత్రమే బుక్ చేసుకున్నచో ఈ పథకం ఏ గ్యాస్ కంపెనీ వాళ్ళు అయినా కుటుంబానికి 4 నెలలకి ఒక సబ్సిడీ ఇవ్వాల్సిందే, అంతే గానీ ఒకే కుటుంబంలో వేర్వేరు లబ్ది దారులు వుండి, వాళ్ళందరూ ఒకే కార్డు లో ఉంటే మాత్రం ఒక్క లబ్ది దారుని పేరు మీద మాత్రమే వస్తుంది.అంతేగానీ ఒకేసారి రెండు వేర్వేరు కనెక్షన్లు కలిగిన వేర్వేరు లబ్ది దారులు ఒకే రేషన్ కార్డులో ఉంటూ లబ్ది పొందాలంటే మాత్రం కుదరదు.
20) ఈ Free Gas Cylinder పథకం ద్వారా బుక్ చేసుకున్న సిలిండర్ ఎన్ని రోజులకి డెలివరీ అవుతుంది ?
జ) ఈ Free Gas Cylinder పథకం ద్వారా బుక్ చేసుకున్న పేద వారికీ పట్టణాలలో అయితే బుక్ చేసుకున్న 24 గంటల్లో మీ ఇంటికి డెలివరీ అవుతుంది. అదే గ్రామాల్లోని వాళ్ళు బుక్ చేసుకున్న 48 గంటల్లో మీ ఇంటికి సిలిండర్ డెలివరీ అవుతుంది?
21) డెలివరీ బాయ్ కి ఇచ్చే డబ్బులు కూడా కలిపి ప్రభుత్వం ఇవ్వనుందా ?
జ) ఈ Free Gas Cylinder పథకం ద్వారా సిలిండర్ డెలివరీ అయ్యాక లబ్ధిదారులు అన్ని చోట్ల కూడా ప్రభుత్వం సూచించిన గ్యాస్ ధర కాకుండా డెలివరీ బాయ్ కి కొంత చార్జీల రూపంలో ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. కానీ ప్రభుత్వం నిర్దిసించిన ధరలను మాత్రమే లబ్ది దారునికి అకౌంట్ లో జమ చేస్తారు.డెలివరీ బాయ్ కి ఇచ్చిన అమౌంట్ మాత్రం వినియోదాదారుడే చెల్లిస్తాడు (కానీ అధికారికంగా అయితే డెలివరీ బాయ్ కి ఇచ్చే సర్వీసు చార్జీలు ఏమి కూడా వినియోగదారుడు ఇవ్వకూడదు, ఎందుకంటే వారికి వాళ్ళు పని చేసే గ్యాస్ ఏజెన్సీ లు ఇచ్చుకోవాలి )
Free Gas Cylinder పథకాన్ని గురించి పూర్తి వీడియో
Related Links
Conclusion
ఈ Free Gas Cylinder పథకం నందు వీలైనంతవరకు చాలా సందేహలకు సమాధానాలు అయితే చెప్పుకున్నాము. కానీ ఇంకనూ ఏమైనా సందేహాలు ఉంటే comment చేయండి. మరొక్కసారి మీ సందేహాలకి అధికారికంగా సమాధానాలు చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తాను.
AP Free Gas Cylinder Scheme
Free Gas Cylinder Scheme Andhra Pradesh
AP Government Free Gas Scheme 2024
0 Comments