పెండింగ్ లో ఉన్న 6400 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలి
పి.డి.యస్.యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం వినోద్ కుమార్
శ్రీకాళహస్తి, MR News (12.09.2025)
విద్యారంగ సమస్యలు వెంటనే పరిష్కరించాలని, పెండింగ్ లో ఉన్న 6400 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం(పి డి ఎస్ యు) ఆధ్వర్యంలో శుక్రవారం శ్రీకాళహస్తిలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి పిడియస్ యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. వినోద్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న 6400 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్, కాస్మోటిక్ చార్జీలును పెంచాలని, సంక్షేమ వసతి గృహాల్లో ఖాళీగా ఉన్న కుక్, కమాటి, వాచ్మెన్ పోస్టులను భర్తీ చేయాలని, పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేసే జీవో నెంబర్ 77ను రద్దు చేయాలని, ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని, సింగల్ మేజర్ విధానాన్ని రద్దు చేయాలని, రాష్ట్రంలో 10 మెడికల్ కళాశాలని ప్రైవేటీకరించే కుట్రలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షు లు ఎస్ . కె జాకీర్ ,సమీర్,ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.

0 Comments