బాల్య వివాహ రహిత ప్రపంచాన్ని నిర్మించడం మన బాధ్యత - ప్రగతి సంస్థ
MR News - శ్రీకాళహస్తి :
ప్రపంచవ్యాప్తంగా బాల్య వివాహాలను నివారించాలని జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ సంస్థ ఈ నెల 12 నుండి 14 వ తారీకు వరకు గ్లోబల్ ఇంటర్ ఫెయిత్ ప్లెడ్జ్ వీకెండ్ కార్యక్రమాన్ని ఈరోజు 100 దేశాలలో ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేవాలయాలు, చర్చిలు, మసీదులలో మత గురువులతో బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేపించడ మైనది.
యాక్సెస్ టు జస్టిస్ ఫర్ చిల్డ్రన్ ప్రాజెక్ట్ లో భాగస్తులైన ప్రగతి సంస్థ ఈరోజు శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో పురోహితులు, ఆలయ సిబ్బంది, వివిధ సంఘాల పెద్దలతో మరియు పెద్ద మసీదులోని ఖాజీ, ఇమామ్ మరియు ముస్లిం సోదరులతో బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేపించడం జరిగింది.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రగతి సంస్థ డైరెక్టర్ కె.వి రమణ మాట్లాడుతూ సమాజంలో బాల్య వివాహాలను నివారించడానికి గత సంవత్సరం ప్రభుత్వంతో కలిసి దేశవ్యాప్తంగా చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ భారత్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ క్యాంపైన్ ద్వారా దేశవ్యాప్తంగా మొత్తం 73,501 బాల్య వివాహాలు ఆపి నాలుగు కోట్ల 90 లక్షల మంది చేత బాల్య వివాహానికి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేపించడం జరిగింది. ఇదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా బాల్య వివాహాలను నివారించడానికి గ్లోబల్ ఇంటర్ ఫెయిత్ ప్లెడ్జ్ వీకెండ్ కార్యక్రమాన్ని ఈరోజు 100 దేశాలలో ప్రారంభించారు. వివాహాలు జరగడానికి వేదికైనటువంటి దేవాలయాలు, మసీదులు మరియు చర్చిలలో బాల్య వివాహాల పైన అవగాహన కల్పించడం చాలా మంచి కార్యక్రమమని వివరించారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ప్రతి సంవత్సరం శివరాత్రి రోజున వేల సంఖ్యల్లో వివాహాలు జరుగుతుంటాయి వాటిలో చాలావరకు బాల్య వివాహాలు కూడా జరిగేవి. ఎక్కువ వివాహాలు జరిగేటటువంటి దేవాలయాల్లో పురోహితుల చేత మరియు మసీదులలో ఖాజీ, ఇమామ్ల చేత ,మరియు మత పెద్దలతో బాల్య వివాహాల గురించి చర్చించి వారి ద్వారా సమాజానికి సందేశం ఇప్పించగలిగితే ప్రజల్లో అవగాహన మరికొంచెం పెరుగుతుందన్నారు.
దేవాలయాల్లో పురోహితులు మరియు ఆలయ సిబ్బంది, మసీదులో ముస్లిం మత పెద్దలు ఈ కార్యక్రమానికి ఎంతగానో సహకరించి బాల్య వివాహాలకు సంబంధించి ఎటువంటి సమాచారం తెలిసిన కఠినంగా ఖండిస్తామని ఈ కార్యక్రమం ద్వారా వారు తెలియజేయడం చాలా సంతోష్కర విషయమని ఆయన పేర్కొన్నారు..
ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు ఆనంద స్వామి, రామస్వామి, జయస్వామి, దేవాలయ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి, ఏ ఈ ఓ విద్యాసాగర్, మోహన్ , సుబ్బయ్య గిరిజన రాష్ట్ర సలహాదారుడు, వజ్రం కిషోర్ టౌన్ కౌన్సిలర్, మాధవ మహేష్ టౌన్ కన్వీనర్, సినీ నటుడు సాంబ రషీద్, ఎస్ లాలు యాంటీ కరప్షన్ డిస్టిక్ ప్రెసిడెంట్, ప్రభుత్వ ఖాజీ బహువుద్దీన్ షరీఫ్, ప్రగతి సంస్థ జిల్లా కోఆర్డినేటర్ రాజారెడ్డి, కమ్యూనిటీ సోషల్ వర్కర్స్ చందమామల కోటయ్య, లత, మోహన్ బాబు తదితరులు పాల్గొన్నారు.
0 Comments