కృష్ణ యాదవ్ చేతుల మీదుగా రైతులకు రాజముద్ర పాస్‌పుస్తకాలు
- శ్రీకాళహస్తి మండలంలోనే మొట్టమొదట పంపిణీ
శ్రీకాళహస్తి, MR న్యూస్:
మేనేజింగ్ డైరెక్టర్ : మునిరత్నం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రైతుల భూములకు ప్రభుత్వ రాజముద్ర కలిగిన కొత్త పాస్‌పుస్తకాలను జారీ చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో, రాష్ట్రవ్యాప్తంగా జనవరి 2వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఈ కార్యక్రమం అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల మేరకు శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని శ్రీకాళహస్తి మండలంలో మొట్టమొదటిసారిగా ముచ్చివోలు సచివాలయ పరిధిలోని బోడావారిపల్లి గ్రామ రైతులకు రాజముద్రతో కూడిన కొత్త పాస్‌పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి మండల టిడిపి అధ్యక్షులు అక్షింతల కృష్ణ యాదవ్ పాల్గొని రైతులకు పాస్‌పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారి యొక్క ఆదేశాలతో త్వరితగిన శ్రీకాళహస్తి నియోజకవర్గం రైతులకువారి భూములకు భరోసా లభిస్తోందని తెలియజేసారు. అదేవిధంగా గత వైయస్ఆర్సీపీ పాలనలో రీసర్వే పేరుతో రైతుల భూములపై అనిశ్చితి నెలకొందని, అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ఫోటోలు ముద్రించిన పాస్‌పుస్తకాలు ఇవ్వడం వల్ల భూముల భద్రతపై రైతుల్లో భయం ఏర్పడిందని అన్నారు.
ఆ భయమే రైతులను ఆలోచింపజేసి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి కారణమైందని వ్యాఖ్యానించారు. అదే సమయంలో ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు రైతులకు భరోసా ఇచ్చారని, అధికారంలోకి వచ్చిన వెంటనే నిష్పక్షపాత సర్వే నిర్వహించి, ఏ నాయకుడి ఫోటో లేకుండా కేవలం ప్రభుత్వ రాజముద్రతో పాస్‌పుస్తకాలు జారీ చేస్తామని హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. ఇచ్చిన హామీ ప్రకారమే రాష్ట్రవ్యాప్తంగా ఈ పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉండగా, శ్రీకాళహస్తి మండలంలోనే మొట్టమొదటగా ముచ్చువోలు సచివాలయ పరిధిలోని బోడా వారి పల్లి రైతులకు కొత్త పాస్ పుస్తకాలు అందజేస్తున్నామని తెలిపారు. రైతులు ప్రస్తుతం ఉన్న పాత పాస్ పుస్తకాలను రెవెన్యూ అధికారులకు సమర్పించి, వాటి స్థానంలో ప్రభుత్వ రాజముద్రతో జారీ చేసిన కొత్త పాస్‌పుస్తకాలను స్వీకరించాలని ఆయన సూచించారు. కొత్త పాస్ పుస్తకాలలో ఏవైనా పొరపాట్లు ఉంటే, సంబంధిత సచివాలయం ద్వారా దరఖాస్తు చేసుకొని సవరణ చేసుకునే అవకాశాన్ని కూడా ప్రభుత్వం కల్పించిందని వివరించారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో ముఖ్య పాత్ర పోషించిన వీఆర్‌ఓ పూర్ణిమను ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా అభినందించారు. రైతుల హక్కులను కాపాడే దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయం అని, ఇవి రైతులకు దీర్ఘకాలిక భద్రతను కల్పిస్తాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్ రెడ్డి, యూనిట్ ఇంచార్జిలు నరసయ్య, చరణ్ మరియు చెలికం శ్రీకాంత్ రెడ్డి, బూత్ ఇన్చార్జిలు మురళి మోహన్ రెడ్డి మరియు మల్లికార్జున్, పవన్ రాయల్, సుబ్బు రాయల్, మరియు రెవెన్యూ అధికారులు మరియు స్థానిక రైతులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




0 Comments