నగదు బదిలీ పథకం
S.No | Group Name | Link |
---|---|---|
1 | Munirathnam Updates | Click Here To Join |
కారణం:
1) ప్రజలు చాలా వరకు రేషన్ సరుకులలో ఇచ్చే బియ్యాన్ని వినియోగించుకోకుండా బ్లాక్ మార్కెట్ నందు అమ్ముకుంటున్నారు.దీనిని ఉపయోగించుకుని దళారులు యథేచ్ఛగా అధికారుల కన్ను గప్పి బయట రాష్ట్రాలకు అమ్ముకుంటూ వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం చాలా సార్లు కూడా ఆ వ్యాపారులపై దాడులు జరిపి చర్యలు తీసుకుంటూ ఉంటున్నా, అది మాత్రం ఆగడం లేదు.మరియు ప్రభుత్వం కూడా అధిక ధరకు బియ్యాన్ని కొని ప్రజలకు సబ్సిడీ కి Rs.1 కే ఇస్తున్నారు.అయినా కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు ఉపయోగ పడలేదు.
2) మరోకోణంలో కూడా చూస్తే ప్రజలు కూడా మార్కెట్లలో దొరికే సన్నబియ్యం కి అలవాటు పడి, ఈ రేషన్ లలో ఇచ్చే నాసిరకం బియ్యాన్ని చాలా వరకు అల్పాహారనికి కొంత పెట్టుకుని, మిగతా అంతా కూడా kg రూ.8/- లనుండి 10/- రూపాయల వరకు అమ్ముకుంటువున్నారు.దీనిని అరికట్టాలని భావించి ప్రభుత్వం ఈ రకమైన నగదు బదిలీ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా ప్రజలకే పూర్తి స్వేచ్ఛని ఇస్తూ రేషన్ లో బియ్యం తీసుకోవాలంటే తీసుకోవచ్చు,లేదా మాకు బియ్యం వద్దు అంటే దానికి ప్రతిఫలంగా డబ్బులు ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది.
పైలట్ ప్రాజెక్ట్:
రాష్ట్ర మంతా ఈ పథకాన్ని ప్రవేశ పెట్టబోయే ముందుగా కొన్ని ప్రాంతాలలో అంటే అనకాపల్లి, గాజువాక, నర్సాపురం, నంద్యాల, కాకినాడలో ఈ పతకాన్ని మే నెల 2022 నుండి అమలు చేయనున్నారు. ఆ తరువాత అక్కడ లోటు పాట్లు ఏవైనా ఉంటే వాటిని సరిచేసి మిగతా జిల్లాలలో కూడా త్వరలోనే ప్రారంభిస్తారు.
అంగీకార పత్రం
1. ఇప్పుడు బియ్యం వద్దంటే మా రైస్ కార్డ్ ( రేషన్ కార్డ్) ఏమైనా క్యాన్సిల్ అవుతుందా..?
జ) ప్రభుత్వం ఈ విషయం పై చాలా క్లారిటీ గా చెప్పింది, ఈ పద్దతి వలన ఎట్టి పరస్థితులలో కార్డు అయితే క్యాన్సిల్ చేయబడదు.
2) రేషన్ బియ్యానికి ఒక kg కి ఎంత ధరగా ఇస్తారు..?
జ) ప్రస్తుతానికి ధర ఇంకా నిర్ణయించలేదు.సుమారుగా 12/- లనుండి 15/- ల వరకు వుండే అవకాశం ఉంది.త్వరలో ప్రభుత్వం ధరను ఫైనల్ చేస్తే మళ్లీ తెలియ పరుస్తాను.
3) రేషన్ బియ్యం ఒకటేనా మిగిలిన సరుకులు కూడా ప్రభుత్వనికే ఇచ్చేయాలా..?
జ) రేషన్ బియ్యం వరకే ప్రభుత్వం రిటర్న్ తీసుకుని దాని ఖరీదు కట్టిస్తుంది. అది కాకుండా మిగిలిన సరుకులు అంటే పంచదార, కందిపప్పు, వగైరా...సరుకులను మీరే తీసుకోవచ్చు
4) ఒకవేళ మధ్యలో ఎప్పుడైనా ఒక నెలలో బియ్యం కావాలి అనుకుంటే, అవకాశం ఉంటుందా..?
జ) దీనిపై కూడా ప్రభుత్వం చాలా క్లారిటీ ఇచ్చినట్టి వార్త పత్రికల్లో కూడా చూసాము.అది ఏ విధంగా ఉంది అంటే వరుసగా రెండు నెలలు బియ్యం వద్దు అనుకున్నా, మరుసటి ఒక నెలలో బియ్యం కావాలంటే మీ వాలంటీర్ కి ముందస్తుగా చెప్పి రిజిస్టర్ చేసుకోవచ్చు అంటున్నారు.
5) దీనికి మేము ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలి..?
జ) పైన చెప్పబడిన ప్రాంతాలలో ప్రస్తుతం ఈ నెల ఏప్రిల్ 18 వతేది నుండి 22 వ తేదీ వరకు మీ వాలంటీర్ అంగీకార పత్రం తీసుకుని వస్తారు. దీనితో పాటు వాలంటీర్ కి ఇక మొబైల్ యాప్ కూడా ఇవ్వడం జరిగింది.అందులో కుటుంబ పెద్ద దగ్గర అంగీకారం తెలిపినట్లు వేలిముద్రలు కూడా తీసుకుంటారు.
వాలంటీర్ కి ఇచ్చిన App నందు ఈ DBT పథకానికి సంబంధించి ప్రజల దగ్గర వాళ్ళ ఈ APP లో అంగీకారం ఎలా తీసుకుంటారో ఇప్పుడు వివరంగా చూద్దాం
వాలంటీర్ కి ముందుగా ఒక Mobile App 1.1గా ఇవ్వడం జరిగింది.
APP LINK :
STEP 1 : ఈ App ని ఇన్స్టాల్ చేసుకున్నాక, వాలంటీర్ యొక CLUSTER ID, PASSWORD ఆధారంగా లాగిన్ అవ్వాలి
దీనికి passward అందరికి కామన్ గా Volunteer@9051 గా ఎంటర్ చేయాలి.ఇందులో "V" Capital Letter గా ఉండాలి.
గమనిక : ఈ లాగిన్, పాస్స్వర్డ్ పైన పేర్కొన్న ప్రాంతాలలో పని చేసే వాలంటీర్స్ కి మాత్రమే ఓపెన్ అవుతాయి గమనించగలరు.
STEP 2 : వాలంటీర్ లాగిన్ అయ్యాక వాలంటీర్ మెను అని అందులో ఒక 6 రకాలైన ఆప్షన్లు చూపించడం జరుగుతుంది, అందులో Reports Option పై క్లిక్ చేయాల్సి ఉంటుంది.
STEP 3 : ఆ తరువాత Reports నందు మళ్లీ 4 రకాల ఆప్షన్స్ మళ్లీ చూపిస్తాయి,అందులో చివర ఆప్షన్ అయిన Consent DBT Rice Card List పై క్లిక్ చేసుకోవాలి
STEP 4 : ఈ పేజీ నందు ఆ వాలంటీర్ కి సంబంధించిన క్లస్టర్ యొక్క రైస్ కార్డ్ ఉన్న లబ్ధిదారులు వివరాలు చూపిస్తుంది.అందులో ఉన్న ప్రతి లబ్ది దారుని దగ్గరకు వాలంటీర్ వెళ్లి వాళ్ళ అభిప్రాయం సేకరించాలి కాబట్టి ఆ లబ్ధిదారుని పేరు పై క్లిక్ చేసి సర్వే ని మొదలు పెట్టాలి.NPCI LINK
ఆ విధంగా చెక్ చేసుకున్నాక లింక్ ఉంటే YES అని లింక్ లేదంటే NO అని పెట్టి SUBBMIT చేయాలి, సబ్మిట్ చేశాక అక్కడ కెమెరా ఓపెన్ అవుతుంది అక్కడ అంగీకార పత్రాన్ని లబ్ధిదారులకు చదివి వినిపించిన తరువాత ఆ ఫారం ని నింపి,సంతకం తీసుకొని దానిని ఇక్కడ ఫోటో తీసి పెట్టి సబ్మిట్ చేస్తే Submit Successful అని వస్తుంది.
Conclusion : ప్రజలు భవిష్యతులో కార్డ్ క్యాన్సల్ అవుతుందేమో అని భయపడకుండా, ఎందుకంటే ఆ అంగీకార పత్రం లొనే కార్డ్ క్యాన్సిల్ కాదు అని ప్రత్యేకంగా చెప్పి వున్నారు, కాబట్టి నిశ్చిoతగా మీరు నిజంగా బియ్యం వాడకుండా ఉంటే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి.బియ్యం తప్ప మిగిలిన సరుకులు యధావిధిగా పొందవచ్చును.ఒక వేల మీకు ఇంకా సందేహం ఉంటే ఆ అంగీకార పై వాలంటీర్ సంతకం చేశాక ఒక Xerox Copy తీసి పెట్టుకోండి.
పై సమాచారం పై మీకు ఎటువంటి సందేహాలు వున్నా మరియు మీ అభిప్రాయాలు చెప్పదలచుకున్నా క్రింద Comment ఆప్షన్ ద్వారా తెలుపగలరు. నన్ను సంక్షేమ పథకాల సందేహాలు కొరకు డైరెక్ట్ గా నాతో మాట్లాడాలి అనుకుంటే ఈ లింక్ ద్వారా మాట్లాడవచ్చును.
Thanking You
0 Comments