July Updates - Ammavodi,Kapu nestham,ysr sunna vaddi -2023
ముఖ్యాంశాలు
1) కాపు నేస్తం & వాహన మిత్ర అప్లై తేదీ పెంపు
2) వైస్సార్ సున్నా వడ్డీ కార్యక్రమం వాయిదా
3) వైస్సార్ నేతన్న నేస్తం పేమెంట్ స్టేటస్
4)అమ్మఒడి డబ్బులు ఇంకా పడలేదా-న్యూ అప్డేట్ ?
INTRODUCTION
ఈ పేజీ నందు మనం ఇప్పుడు ప్రధానంగా ఈ జులై 26 వ తారీఖు వరకు వున్న ప్రధాన 4 అప్డేట్స్ గురించి తెలుసుకుందాం.కనుక ఈ పేజీని పూర్తిగా చదివి పూర్తి అవగాహన పరచుకొండి.మరియు ప్రస్తుతం ఈ జులై నెలలో Ap లో వున్న ప్రధానమైన అప్డేట్స్ కూడా ఇవే.
1) కాపు నేస్తం & వాహన మిత్ర అప్లై తేదీ పెంపు
జ) కాపు నేస్తం మరియు వాహన మిత్ర కార్యక్రమాలకు సంభదించి ఈ జులై నెలలోనే క్రొత్తగా దరఖాస్తు చేసుకోదలచిన లేదా గతంలో అమౌంట్ వచ్చిన వారు రెన్యూవల్ చేసుకోదలచిన చేసుకుంటూవున్నారు.కానీ వాటికీ చివరి తేదీ లు జులై 25 వరకుమాత్రమే వున్నాయి.కావున ఆ సమయం ముగుస్తున్నందున మళ్ళీ ఆ తేదీలను ఈ జులై 27వ తేదీ వరకు పెంచడం జరిగింది.కనుక ఈ అవకాశాన్ని ప్రజలు ఉపయోగించుకోగలరు.ఇలా తేదీ పెంపు అవకాశం వచ్చిందని మీ మిత్రులకు కూడా తెలియజేయండి.
ఈ పథకాలలో ఏదైన సందేహలు వునన్నూ లేదా ఇబ్బందులు వున్ననూ జగనన్నకి చెబుదాం అనే కార్యక్రమానికి సంబంధించిన 1902 కి కాల్ చేసి తెలియజేయగలరు.
ఈ సంవత్సరం కాపు నేస్తం నిబంధనలు,న్యూ టైం లైన్
దీనికి సంబంధించి ఈ క్రింది వీడియో చూడగలరు.పూర్తి పరిజ్ఞానం లభించును.
2) వైస్సార్ సున్నావడ్డీ కార్యక్రమం వాయిదా
జ) ఈ వైస్సార్ సున్నా వడ్డీ కార్యక్రమమం డ్వాక్రా మహిళలకు సంబంధించిన కార్యక్రమం కనుక ఈ కార్యక్రమం అనేది ఈ జులై 26 వ తేదీన అమలాపురం నందు ముఖ్యమంత్రి గారు ప్రారంభిచాల్సి వుంది.కానీ ప్రస్తుతం అక్కడ అధిక వర్షాల కారణంగా ఆ కార్యక్రమాన్ని వాయిదా వేయడం జరిగిందని ఉన్నతాధికారులు తెలియజేసారు.కావున మరో తేదీని అధికారికంగా ఖరారు చేసినప్పుడు మరలా మీకు తెలియపరుస్తాను.
ఈ వైస్సార్ సున్నా వడ్డీ అర్హుల జాబితా
ఈ వైస్సార్ సున్నా వడ్డీ అనేది ద్వాక్రా అక్క,చెల్లెమ్మలుకు వారు సంఘంలో తీసుకున్న అప్పుని క్రమం తప్పకుండా వడ్డీ అసలు చెల్లించిన వారికీ ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చినట్టుగానే సున్నావడ్డీకే రుణాలు అనే కాన్సెప్ట్ తో మీరు కట్టిన వడ్డీ ని వెనక్కు వేయడాన్నే ఈ వైస్సార్ సున్నా వడ్డీ అంటారు.కనుక దీనికి సంబధించిన అర్హుల సంఘాల జాబితా అనేది సచివాలయం లోని వెల్ఫేర్ సెక్రెటరీ యొక్క లాగిన్ లో వచ్చి వున్నాయి.కనుక ఆ ఉద్యోగి ఆ లిస్ట్ ని నోటీసు బోర్డు నందు ప్రకటించి వుంటారు.అదే విధంగా మీ సంఘానికి సంబంధించిన RP లని అడిగినా కూడా తెలియజేస్తారు.అక్కడ మీకు ఏదైనా ఇబ్బదులు ఎదురైతే 1902 కి కాల్ చేయగలరు.
3) వైస్సార్ నేతన్న నేస్తం పేమెంట్ స్టేటస్
గమనిక: మీ ఆధార్ నెంబర్ ఏ బ్యాంక్ కి అయితే లింక్ అయిందో దానికి మాత్రమే అమౌంట్ పడుతాయి.దానినే NPCI లింక్ అవ్వడం అంటారు.కనుక ఈ విషయాన్ని లబ్ధిదారులు గమనించగలరు.దానిని కూడా మీ ఆధార్ నెంబర్ తో సులభంగా ఈ క్రింద ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి తెలుసుకికోవచ్చును.ఒకవేళ అక్కడ ఏ బ్యాంకు కి లింక్ లేకపోతే మీరు లావాదేవీలు జరుపుతున్న బ్యాంక్ వద్దకు వెళ్లి NPCI లింక్ చేయమని అధికారులను కొరవలెను.
4) అమ్మఒడి డబ్బులు ఇంకా పడలేదా-న్యూ అప్డేట్ ?
జ) ఈ జులై 26 వతేదీ వచ్చిన అమ్మఒడి అప్డేట్ ఏమిటంటే ఇప్పటివరకు అందరికి డబ్బులు వేసే కార్యక్రమం పూర్తి అయినదని అధికారవర్గాలు తెలియజేస్తున్నారు.కావున దీనికి సంబంధించి ఈ వారం చివరన అంటే జులై 31 కల్లా ఇంకా ఎవరికైనా డబ్బులు పడకపోతే ఎందు కారణం చేత అమౌంట్ పడలేదో ఆ వివరాలను NBM పోర్టల్ లో అప్డేట్ చేస్తామని కావున అప్పటి నుండి సచివాలయం లో NBM పోర్టల్ లో PAYMENT అనే ఆప్షన్ ద్వారా గ్రీవెన్స్ పెట్టుకోవాలి అని చెబుతున్నారు.ఆ తదుపరి వాళ్లకు అమౌంట్ ఎప్పుడు వేస్తారు అనేది క్లారిటీ ఇవ్వాల్సి వుంది.ఇదే కాకుండా ఇప్పటికే కొంతమందికి రూ 9000,రూ 5000 పడ్డవారికీ కూడా మిగిలిన అమౌంట్ జమయ్యాయి.కనుక ఒకసారి క్రొత్తగా అప్డేట్ అయిన పేమెంట్ స్టేటస్ లింక్ నందు చెక్ చేసుకోగలరు.
పేమెంట్ స్టేటస్ చెకింగ్ (క్రొత్తగా అప్డేట్ చేసిన తరువాత)
Related Links
PM కిసాన్ 14 విడత అమౌంట్ రిలీజు తేదీ మరియు అర్హుల జాబితా కూడా విడుదల అవడం జరిగింది.కనుక మీ సౌకర్యార్ధం ఈ క్రింద లింక్ ఇవ్వబడింది.
ఈ 2023 సంవత్సరం లో మీ కుటుంభం వైస్సార్ భీమాలో రిజిస్టర్ అయ్యారా..లేదా అనే విషయాన్నిఈ క్రింధీ లింక్ ద్వారా తెలుసుకుందాం.
Conclusion
ఈ పేజీ లో మనము ప్రధానంగా వైస్సార్ కాపు నేస్తం మరియు వైస్సార్ వాహన మిత్ర కి సంబంధించిన జులై అప్డేట్స్ గురించి మరియు వైస్సార్ నేతన్న నేస్తం లో పేమెంట్ వివరాలు తెలుసుకునే విధానము గురించి తెలుసుకున్నాము.కావున ఇవే కాకుండా ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయగలరు.
0 Comments