New Arogya Sri Card Benefits in AP
ఈ పేజీలో వివరించుకోబోయే ప్రధానాంశాలు ఇవే..!
1) ANM,హెల్త్ ఆఫీసర్ యొక్క విధులు ఏమిటి ?
2) గ్రామ/వార్డు వాలంటీర్ యొక్క విధులు ఏమిటి..?
3) వాలంటీర్ క్లస్టర్ లో ఎన్ని కార్డ్స్ పంపిణీ చేశాడో..Report Link..?
4) సచివాలయ మహిళా పోలీస్ యొక్క విధులు ఏమిటి..?
5) రాజకీయ నాయకుల విధుల ఏమిటి..?
New Arogya Sri Cards - ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఖరీదైన వైద్యాన్ని కార్పొరేట్ హాస్పిటల్ లో ఉచితంగా అందిచాలనే లక్ష్యంతో ఇప్పటివరకు వరకు ఉన్న Arogya Sri పరిధి కుటుంబానికి 5 లక్షలు ఉన్న దానిని సంవత్సరానికి 25 లక్షలకు పెంచడం జరిగింది.కావున దీనికి సంబంధించిన New Arogya Sri card ని డిసెంబర్ 18, 2023 వ తేదీన ముఖ్యమంత్రి గారు ప్రారంభించినారు.
క్రొత్త ఆరోగ్య శ్రీ కార్డ్ యొక్క ప్రత్యేకతలు
A) ప్రతి క్రొత్త ఆరోగ్య శ్రీ కార్డ్ నందు క్యూఆర్ కోడ్, మరియు కుటుంబ సభ్యుల ఫోటో,మొబైల్ నెంబర్ తో డిజైన్ చేయడం జరిగింది.
B) ఈ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి లాగిన్ అవడం వలన రోగి చేయించుకునే వ్యాధి నిర్ధారణ పరీక్షలు మరియు రోగి తీసుకుంటున్న వైద్యం,చికిత్స లు,డాక్టరు సిఫార్సులు మరియు ఆసుపత్రికి చేరడానికి గూగుల్ మ్యాప్స్ ద్వారా గమ్యం చేరుకునేటట్టు ప్రత్యేకంగా ఈ కార్డ్ ని డిజైన్ చేయడం జరిగింది.
C) ఆరోగ్య మిత్ర కి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ కూడా తెలుసుకునే అవకాశం కలదు.
1) ANM,హెల్త్ ఆఫీసర్ యొక్క విధులు ఏమిటి (New Arogya Sri Card) ?
ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబంలో ఒక్కరి మొబైల్ లో అయినా ఆరోగ్య శ్రీ యాప్ ని ఇన్స్టాల్ చేయించాలి. వారితో పాటుగా ఆశా వర్కర్లు కూడా వుంటారు.వీళ్ళందరూ ఆరోగ్య శ్రీ ని వాడుకునే విధానాన్ని ప్రజలకు వివరించడం జరుగుతుంది.
2) గ్రామ / వార్డు వాలంటీర్ యొక్క విధులు ఏమిటి..?
గ్రామ/ వార్డు వాలంటీర్స్ ప్రభుత్వం ఇచ్చిన క్రొత్త ఆరోగ్య శ్రీ కార్డ్ ని ఆయా కుటుంబాలకు చేరవేస్తూ, వారి దగ్గర బయోమెట్రిక్ వేసుకుంటారు.దీనితో పాటుగా ఆరోగ్యశ్రీ వాడకాన్ని కూడ అవగాహన పరుస్తారు.
మొబైల్ యాప్ లో వాలంటీర్ ఆరోగ్య శ్రీ కార్డ్ ని పంపిణీ చేయు విధానం (DEMO VIDEO)
3) వాలంటీర్ ప్రకారం ఎన్ని పంపిణీ చేశారో తెలుసుకునే వెబ్సైట్ లింక్
Report Link - CLICK HERE
4) సచివాలయ మహిళా పోలీస్ యొక్క విధులు ఏమిటి..?
ఈ క్రొత్త ఆరోగ్య శ్రీ కార్డులు పంపిణీ చేసేటప్పుడు ప్రతి ఇంటిలోని మహిళలకు దిశ యాప్ డౌన్లోడ్ చేయించి,దాని వాడకం మీద అవగాహన పరచాల్సి వుంటుంది.
5) రాజకీయ నాయకుల విధుల ఏమిటి..?
స్థానిక ప్రజా, ప్రతినిధులు మీ గ్రామాలలో మరియు పట్టణాలలో ఈ క్రొత్త ఆరోగ్య శ్రీ కార్డుని ప్రజలకు అందిచేటప్పుడు ముందుగా ప్రజలతో ఒక కార్యక్రమం ఏర్పాటు చేసుకుని, పేద ప్రజలకు ఈ కార్డ్ ద్వారా ఎంత మేలు జరగనుందో అని వివరంగా అవగాహన పరచాలి.
Conclusion
మన పాఠకులకు ఈ క్రొత్త ఆరోగ్య శ్రీ కార్డ్ కి సంబంధించి చాలా వివరాలును ఈ పేజీలో చర్చించుకున్నాము.కనుక ఇదే విధంగా ప్రభుత్వ పరమైన సంక్షేమ పథకాల అప్డేట్స్ కి సంబంధించి ఎప్పటికప్పుడు మీరు కూడా తెలుసుకోవాలి అనుకుంటే మనకు సంబంధించిన వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవగలరు.
0 Comments