ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతకు ఘన సన్మానం తలపా దామోదరం రెడ్డి
తొట్టంబేడు, MR News:
తొట్టంబేడు మండలం, దిగువ సాంబయ్యపాలెం నందుగల ఫౌండేషన్ స్కూల్లో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయునిగా పనిచేయుచున్న కయ్యూరు బాలసుబ్రమణ్యంకి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ఇచ్చిన నేపథ్యంలో శ్రీకాళహస్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తలపా దామోదరం రెడ్డి ఆధ్వర్యంలో వారిని ఘనంగా సన్మానించడం జరిగినది. ఈ సందర్బంగా తలపా దామోదరం రెడ్డి మాట్లాడుతూ బాల సుబ్రహ్మణ్యం గారు ఉపాధ్యాయులు గానే కాక కవిగా,రచయితగా,మిమిక్రీ కళాకారులుగా, విద్యార్థులకు చేరువై సరళీకృతమైనటువంటి పద్ధతిలో విద్యను అందించడంలో వారు ఎనలేని కృషి చేస్తున్నారని వారిని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు సురేంద్ర రెడ్డి, శ్రీకాళహస్తి పట్టణ యువజన అధ్యక్షులు ఆంటోనీ, బాలాజీ, అరుణ్, మహేష్,చిరంజీవి, అల్లావుద్దీన్, జోసెఫ్ తదితరులు పాల్గొన్నారు.
0 Comments