vahana mitra scheme details 2025
వాహన మిత్రకు (Vahana mitra) సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ ఈ పేజీలో తెలుసుకుందాం
Vahana mitra - ఆంధ్రప్రదేశ్ నందు ఉమ్మడి కూటమి ప్రభుత్వం వాహన మిత్ర (Vahana mitra) అనే పేరుతో సొంతంగా ఆటో గాని టాక్సీ లేదా క్యాబ్కలిగి వున్నా వారికీ, సంవత్సరానికి 15 వేల రూపాయలు ఆర్థిక సహాయం చేయడం కొరకు సెప్టెంబర్ 10 వ తేదీన అనంతపురంలో జరిగిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే కార్యక్రమం నందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు.
మరిన్ని ప్రభుత్వ పథకాల సమాచారాలు ఈ గ్రూప్ లో ఇస్తుంటాను - JOIN
వాహన మిత్ర (Vahana mitra) పథకానికి ఎవరు అర్హులు?
సొంతంగా ఆటో గాని టాక్సీ లేదా క్యాబ్కలిగి ఉండి, వాళ్లే డ్రైవర్లుగా ఉంటూ, వారి కుటుంబ జీవనానికి ఇదే ప్రధాన ఆధారంగా ఉండి జీవించే వాళ్లకు ఈ వాహన మిత్ర పథకంలో (Vahana mitra) ఆర్థిక సహాయం లభిస్తుంది.
2) ఈ 2025 లో వాహన మిత్ర (Vahana mitra) పథకానికి సంబంధించి గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన తేదీలు
గతంలో ప్రభుత్వంలో వాహన మిత్ర పథకంలో అర్హులుగా ఉన్న వారి దగ్గర (GSWS) జాబితా ప్రకారం 2,75,000 మంది గ్రామ వార్డు / సచివాలయంలో కలదు.కావున దీనికి సంబంధించి సచివాలయ ఉద్యోగులకు లబ్ధిదారుల వివరాలును గ్రౌండ్ లెవెల్లో వెరిఫికేషన్ చేస్తారు.ఎందుకంటే ఈ సంవత్సరం ఈ పథకానికి అర్హులా కాదా అని చెక్ చేస్తారు. దీనితో పాటు ఈ సంవత్సరం క్రొత్తగా దరఖాస్తు చేసుకునే వాళ్లకు కూడా అవకాశం కల్పిస్తారు.
- కొత్తగా దరఖాస్తు చేసుకోవాలనుకున్న వారికి సెప్టెంబర్ 17,2025 నుండి గ్రామ/వార్డు సచివాలయంలో దరఖాస్తులు స్వీకరిస్తారు.
- సెప్టెంబర్ 19 వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేస్తారు.
- సెప్టెంబర్ 22, 2025 తేది లోపల ఫీల్డ్ వెరిఫికేషన్ కూడా పూర్తి చేస్తారు.
- ఫైనల్ అర్హుల జాబితా సెప్టెంబర్24, 2025 విడుదలవుతుంది.
- అమౌంట్ విడుదల తేదీ.. అక్టోబర్1, 2025 న ముఖ్యమంత్రి చేతుల మీదుగా విడుదలవుతుంది.
వాహన మిత్ర (Vahana mitra) పథకానికి ఉండాల్సిన అర్హతలు
- దరఖాస్తుదారుడు ఆధార్ కార్డు కలిగి ఉండాలి.
- దరఖాసుదారుడు రైస్ కార్డు నెంబర్ కలిగి ఉండాలి
- సొంతంగా కారు గాని టాక్సీ/ ఆటో/ కారు (L బోర్డు) కలిగి ఉండాలి
- దరఖాస్తుదారుడు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి
- ఒరిజినల్ RC తన పేరు మీద ఉండాలి.
- కుటుంబంలో ఒక్క వాహనానికి మాత్రమే ఎలిజిబుల్.
- వేరే రాష్ట్రంలో వెహికల్ రిజిస్ట్రేషన్ ఉన్నవాళ్లు అడ్రస్ ని ఆంధ్రప్రదేశ్ కి మార్చుకుంటేనే అర్హులవుతారు.
- దరఖాసుదారుడు యాక్టీవ్ లో ఉన్న బ్యాంకు ఖాతా కలిగి ఉండాలి
గమనిక - NPCI లింక్ వున్న బ్యాంక్ ఖాతాకే డబ్బులు పడనున్నాయి.
Checking Link - CLICK HERE
మీ RC ని మీరే Download చేసుకునే అవకాశం - Download
- దరఖాస్తుదారుడు యొక్క కుటుంబ యొక్క ఆదాయం గ్రామీణ ప్రాంతంలో వారైతే నెలకు రూ10,000 దాటకూడదు, అదే పట్టణ ప్రాంతంలో వారైతే నెలకు రూ12,000 మించకూడదు.
- మొత్తం కుటుంబానికి మూడు ఎకరాల మాగాణి లేదా మెట్ట పది ఎకరాలు, లేదా మాగాణి, మెట్ట రెండూ కలిపి 10 ఎకరాలకు మించకూడదు.
- కుటుంబంలో ఎవరికీ ప్రభుత్వ ఉద్యోగం గానీ, లేదా ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్ గాని పొందుతూ ఉండకూడదు.
- నివసిస్తున్న కుటుంబానికి ఇంటి యొక్క కరెంట్ బిల్లు ఒక సంవత్సర కాలం వాడిన సరాసరి యూనిట్లు ,300 యూనిట్లకు మించకూడదు.
- పట్టణ ప్రాంతంలో నివసిస్తున్న వారి కుటుంబ సభ్యులలో ఎవరి పేరు మీద అయినా స్వంత ఇల్లు 1000 చదరపు అడుగులు కంటే మించి ఉండకూడదు.
- కుటుంబంలో ఎవ్వరూ కూడా ఆదాయపన్ను చెల్లిస్తూ ఉండకూడదు.
- కుటుంబంలో ఏ ఒక్కరి పేరు మీదైనా ఫోర్ వీలర్(స్వంతానికి) కలిగి ఉండకూడదు. ఆటో, ట్రాక్టర్ కలిగి ఉండచ్చు.
గమనిక - పైన తెలిపిన అర్హతలు ఈ సంవత్సరం ఇలా ఉంటాయి అని ఉమ్మడి కూటమి ప్రభుత్వం ప్రత్యేకమైన విధి విధానాలు విడుదల చేయలేదు.ఈ ప్రభుత్వం ఇప్పటివరకు అమలు చేసిన పథకాలు అన్నింటికీ గత ప్రభుత్వం అమలు చేసిన అర్హతలనే కొనసాగిస్తుంది కనుక, అదే పంథాలో ఇప్పుడు కూడా క్రొత్త అర్హతలు ప్రకటించకుండానే న్యూ అప్లికేషన్ మరియు వెరిఫికేషన్ నాకు సెప్టెంబర్ 17 నుండి 22 వరకు కేటాయించారు. కనుక గత అర్హతలనే ప్రమాణికంగా తెలియజేస్తున్నాము.
వాహన మిత్ర (Vahana mitra) పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
ఈ 2025 వాహన మిత్ర పథకంలో క్రొత్తగా రిజిస్టర్ చేసుకోవాలంటే మీ గ్రామ / వార్డ్ సచివాలయంలోని వెల్ఫేర్ సెక్రెటరీ వెళ్లి కలసి సెప్టెంబర్ 19 లోపల రిజిస్ట్రేషన్ చేయించుకోండి. పాతవాళ్ళు ఉంటే సచివాలయ సిబ్బంది దగ్గర గత ప్రభుత్వంలో Transport డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర వున్న జాబితాలో వున్న వారికీ ఫీల్డ్ వెరిఫికేషన్ చేస్తారు.
- వెరిఫికేషన్ వారి కోసం సచివాలయ ఉద్యోగుల యాప్ లో ఆప్షన్స్ ఇచ్చాక మరిన్ని వివరాలను Watsapp group లో తెలియపరుస్తాను. అదే గతం ప్రభుత్వంలో వెరిఫికేషన్ సమయాన ఎలాంటి డాకుమెంట్స్ ఇవ్వాల్సిన అవసరం లేకుండా, ప్రస్తుత సంవత్సరానికి వెహికల్ దగ్గర నిల్చొని ఫోటో ఇచ్చేవాళ్ళు మరియు Ekyc చేసుకునే వాళ్ళు. బహుశా ఇప్పుడు కూడా అలానే చేసే అవకాశం ఉంటుంది.
వాహన మిత్రకి కావాల్సిన డాక్యుమెంట్స్
- అప్లికేషన్
- R.C బుక్ జిరాక్స్
- డ్రైవింగ్ లైసెన్స్
- క్యాస్ట్ సర్టిఫికేట్
- ఇన్కమ్ సర్టిఫికెట్
- బ్యాంకు బుక్ జిరాక్స్
- ఆధార్ కార్డు జిరాక్స్
- రైస్ కార్ జిరాక్స్
- ఆధార్ లింక్ అయిన ఫోన్ నెంబర్
వాహన మిత్ర పథకంలో మేము అర్హులమయ్యామా లేదా అనే విషయాన్ని ఎలా తెలుసుకోవాలి?
వాహన మిత్ర పథకం నందు మనం ఈ సంవత్సరం అర్హులం అయ్యామా లేదా అని NBM పోర్టల్ నందు అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవచ్చు. (ఈ రోజు నాటికీ ఇంకా ఇవ్వలేదు, త్వరలో అప్డేట్ చేస్తారు)
NBM Portal Status - CLICK HERE
వాహన మిత్ర పథకం 2025 లో డబ్బులు వేయనున్నారు ?
వాహన మిత్ర పథకంలో డబ్బులు పడ్డాయా లేదా ఎలా తెలుసుకోవాలి?
దీనికి సమాధానం కూడా పైన అప్లికేషన్ స్టేటస్ కొరకు ఇచ్చిన వెబ్సైటు లింక్ ద్వారానే ఆధార్ ఇచ్చి OTP ఇచ్చాక పేజీ చివరన Payment Status అనే ఆప్షన్ దగ్గరఏ బ్యాంక్ ఖాతాలో ఎంత అమౌంట్ పడిందో చూసుకోవచ్చు.
0 Comments