Self Caste Survey Registration For Citizen in AP
ఈ పేజీలో మనం చెప్పుకోబోతున్న ప్రధానాంశాలు
1) ప్రజలే స్వయంగా కులగణనలో రిజిస్టర్ చేసుకునే విధానం
ఇలాంటి లేటెస్ట్ సమాచారాలు ఎప్పటికప్పుడు మీరు కూడా తెలుసుకోవాలి అనుకుంటే ఇక్కడ ఇచ్చిన whats App group నందు జాయిన్ అయితే అందులో అప్డేట్స్ వస్తూ ఉంటాయి.
Self caste survey Registration
ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన ప్రజలు ఈ caste survey ని బాధ్యతగా భావించి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.ఎందుకంటే ఇప్పటివరకు పరిపాలన సాగిస్తున్న కుల వివరాల్లో మొత్తం కూడా 1936 లో సేకరించిన కులాల ప్రకారం ప్రకారం మాత్రమే పాలనా చేస్తున్నారు.కనుక ఇప్పుడు AP లో సచివాలయ ఉద్యోగులు మరియు వాలంటీర్స్ మీ ఇంటి వద్దకు వచ్చి మీ కుల వివరాలను వాళ్ళ లాగిన్ తో రిజిస్టర్ చేస్తున్నారు.
వాలంటీర్స్ ఈ కులగణన చేయాలంటే ఖచ్చితంగా ఆ వాలంటీర్ లాగిన్ లో మీ కుటుంబ వివరాలు ఉండాలి.అలా ఉంటేనే వాళ్ళు ఈ సర్వేని చేయగలరు.లేనిచో వాళ్లకు ఎలాంటి ఆప్షన్ లేదు.కనుక దీనికోసం ప్రభుత్వం "ఎక్కడా House mapping లేని కుటుంబాలు మీ ఫోన్ లోనే స్వయంగా ఈ caste survey లో వివరాలు నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించారు."
Caste Self Registration Link - CLICK HERE
మీ వాలంటీర్ దగ్గర మీ కుటుంబ వివరాలు ఎలా ఉన్నాయో చెకింగ్ చేసుకునే లింక్ - Click Here
STEP 1- మొదట ఎక్కడ హౌస్ మాపింగ్ లో లేని సిటిజెన్ పై లింక్ ఓపెన్ చేస్తే ఈ క్రింది రకమైన పేజీ ఓపెన్ అవుతుంది.అక్కడ కుటుంబంలో ఎవరిదైనా ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి Get Details అని ఎంటర్ చేస్తే వారి ఆధార్ కి లింక్ అయినా ముబైల్ నెంబర్ కి వచ్చిన OTP ని ఎంటర్ చేయాలి.ఆ తరువాత ఫోటో లో చూపించిన విధంగా మీ వివరాలు ఎంటర్ చేసుకోవాలి.
ఇక్కడ ఒకవేళ మీ ఆధార్ ఎంటర్ చేయగానే మీరు ఈ house hold నందు ఇదివరకే మాపింగ్ అయి వున్నారు అని వస్తే మాత్రం సంబంధిత వాలంటీర్ దగ్గర మాత్రమే ఈ caste survey చేసుకోవాల్సి వస్తుంది.
STEP 2 - ఆ తరువాత * మార్కు వున్నా ప్రతి వివరాలు తప్పక ఎంటర్ చేయాలి,స్టార్ మార్క్ లేని వివరాలు ఎంటర్ చేయకపోయినా పర్వాలేదు.మరియు ఈ పేజీలో కులం మరియు విద్యార్హతలు ఎంటర్ చేసుకుని చివరగా మీ అంగీకారం కొరకు Submit పై క్లిక్ చేయగానే మీ కులగణన సర్వే విజయవంతంగా పూర్తి అయినట్టు లెక్క.
0 Comments